Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్
నవతెలంగాణ-భూపాలపల్లి
ఓటరు జాబితా నుంచి తోలగించిన ఓటర్ల వివరాలను మరో సారి సరిచూసి, పరిశీలించి ధవీకరించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు. బుధవారం హైదరాబాద్ నుండి ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ సంయుక్త ప్రధాన ఎన్నికల అధికారి టి. రవి కిరణ్ తో కలిసి జిల్లా కలెక్టర్ లతో ఓటర్ జాబితా, పి.ఎస్.ఈ ఎంట్రీ ధవీకరణ, ఓటర్ ఎపిక్ కార్డుల జారీ పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మొదటి విడత కింద రాష్ట్రవ్యాప్తంగా 22 లక్షల ఫోటో సిమిలర్ ఎంట్రీ పరిశీలన చేసి డబుల్ ఎంట్రీ, డుప్లికేట్ లను తోలగించామని , ప్రస్తుతం క్షేత్రస్థాయిలో తొలగించిన ఓట్ల వివరాలు అధికంగా ఉన్నందున మరోసారి పరిశీలించాలని సూచించారు. జిల్లాలో ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లిన వారి ఓట్లు, మరణించిన వారి ఓట్లు, డూప్లికేట్ ఓట్లు జాబితా నుంచి తొలగించామని, తొలగించిన ఓట్లకు సంబంధించి సంపూర్ణ సమాచారం మన వద్ద అందుబాటులో ఉండాలని, తొలగించిన ఓట్ల వివరాలు మరోసారి పరిశీలించి ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు అవసరమైన డాక్యుమెంట్లు ఉన్నాయో లేవో ధ్రువీకరించాలని ఆయన పేర్కొన్నారు. ఓటరు జాబితా రూపకల్పనలో బూత్ స్థాయి అధికారులు కీలకపాత్ర పోషిస్తారని, ప్రైవేట్ వ్యక్తులను బూత్ స్థాయి అధికారులు గా నియమించవద్దని, ఎక్కడైనా అలా ఉంటే 7 రోజులలో తొలగించి ప్రభుత్వ సిబ్బంది నియమించాలని ఆయన సూచించారు. ఓటర్ జాబితాబ్ కు సంబంధించిన సమాచార హక్కు చట్టం దరఖాస్తులను సకాలంలో సమాధానం అందించాలని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కోన్ని ఓటర్ ఐడి కార్డులలో పుట్టిన రోజు తేదీలు ఒకే విదంగా ఉన్నాయని వాటి వివరాలు క్షేత్రస్థాయిలో పరిశీలించి సవరించాలని ఆయన పేర్కొన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, ఆర్.డి.ఓ., శ్రీనివాస్, సంబంధించిన అధికారులు తదితరులు పాల్గొన్నారు..