Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ములుగు
ఈ నెల 14 న ములుగు జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటుచేసిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్132 వ జయంతి కార్యక్రమాన్ని వందలాది మంది హాజరై జయప్రదం చేయాలని ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో బుధవారం గోడపత్రికను ఆవిష్కరిం చారు. అనంతరం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి యాక్ట్ జిల్లా కమిటీ సభ్యులు జన్ను రవి మాదిగ, మాదిగ దండోరా జాతీయ నాయకులు నెమలి నర్సయ్యమాదిగ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సావిత్రిబాయి పూలే, జ్యోతిరావు బాపూలే విగ్రహాలను నెలకొల్పాలని డిమాండ్ చేశారు. ములుగు జిల్లా కేంద్రంలో బాబు జగ్జీవన్ రామ్, ఆదివాసీల అస్తిత్వ వీరులు కొమరం భీమ్, తెలంగాణ సాయుధ రైతంగా పోరాట ఉద్యమకారుడు దొడ్డి కొమరయ్య విగ్రహాలను నెలకొల్పాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రభుత్వాలపై ఉద్యమిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మహాజన సోషలిస్టు పార్టీ అధ్యక్షుడు మరాఠీ రవీందర్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు నక్క బిక్షపతి చుంచు రవి, ఎమ్మార్పీఎస్ మహిళా విభాగం ఆర్గనైజర్ బట్టు మమతమాదిగ, ములుగు మండల నాయకులు పలువాల రాజకుమార్, పసుల కష్ణ మాదిగ, బొమ్మ కంటి సుధాకర్ మాదిగ, మేర హక్కుల సమితి దాసు ఆగయ్య తదితరులు పాల్గొన్నారు