Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నెల్లికుదురు
మండల కేంద్రంలో ఉన్న మహిళలకు సంబంధించిన మయూరి మండల సమైక్య కార్యాలయంలో 46 గ్రామైక్య సంఘాలు ఉన్నాయి. వీటికి వివోఏలు 46 మంది ఉన్నారు. కానీ మండలంలోని గ్రామాలలో ఉన్నటువంటి 46 గ్రామైక్య సంఘాల ఆధ్వర్యంలో 1147 ఎస్‌హెచ్ గ్రూపులు ఉన్నాయని వీటిని నడిపించేది బాధ్యత వివోఏలదే. వీరు ఒక్కొక్క ఎస్‌హెచ్ గ్రూపులో 10 నుండి 12 మంది ఉం టారు. వీరికి ఆ గ్రూపుకు సంబంధించిన సభ్యులందరికీ వివోఏలు లోన్ ఇప్పించ డం ఇప్పించిన వాటిని రికవరీ చేయించడం వీటితోపాటు సభ్యులకు శ్రీనిధి లోన్లు ఇప్పించడం మరలా వీటిని నెలల వారీగా వసూలు చేసి కట్టడంతోపాటు ఒక్కొక్క గ్రామంలో ఒకటి నుండి మూడు నాలుగు గ్రామైక్య సంఘాలు ఉంటాయని, ఈ సంఘాలకు సంబంధించిన ఒక్కొక్క సంఘం పరిధిలో 25 నుండి 35 వరకు గ్రూ పులు ఉంటాయని అన్ని కలిపి ఒక గ్రామైక్య గ్రూపుగా ఏర్పడి మీరు బాధ్యత గ్రా మైక్య సంఘాల సమక్షంలో నెల నెల వారీగా రికార్డులు రాయడం పొదుపు లెక్క లు చేయడం అప్పు లెక్కలు చేయడం ఇలా ఒక్కొక్క గ్రూపుకు సంబంధించిన తీర్మా నాలు చేసుకోవడం ఇవన్నీ గ్రామస్థాయిలో సీఏలు అయినటువంటి వివోఏ లు చూసుకుంటారు. వీరికి ఒక్కొక్క గ్రామంలో సుమారు 50 నుంచి 60 గ్రూపు లు ఉంటాయి. వీటికి పొదుపు లెక్కలతో పాటు నెల వారి సమావేశాలు జరుపుకు న్న తీర్మానాలు కూడా వీరే నిర్వహిస్తారు. ఇంత పెద్ద పని చేసినప్పటికీ ప్రభుత్వం వీరిని సర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించకపోవడంతో బాధాకరంగా ఉన్నారని సిఏలు నిరసన తెలుపుతున్నారు. వీటితోపాటు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు రకాల సంక్షే మ పథకాలు కూడా గ్రామస్థాయిలో ఒక్కొక్క ఇంటికి చేరే విధంగా మాతో పనులు నిర్వహించుకుంటున్నారని అదనపు భారం పడుతుందని తెలుపుతున్నారు. ఇంత పని చేసినప్పటికీ సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించకపోవడంతో ప్రభుత్వం ఫస్ట్ 50 రూపాయలులతో స్టార్ట్అయిందని గతంలో 3000 ఇచ్చేదని ఎప్పుడు 900 పెంచి 3900 రూపాయలు వేతనంగా ఇస్తున్నారని ఎంత వెట్టిచాకిరి చేస్తుంటే 3900 వందల రూపాయలతో కుటుంబాన్ని పోషించుకోవడం వీళ్ళు కాకపోతోం దని వీరికి తక్షణమే పనికి తగ్గట్టుగా వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని ఉన్నప్ప టికీ ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం విచారకరమని గ్రామస్థాయి వివోఏలు తెలుపుతున్నారు. ఇప్పటికైనా ఇంత పని చేస్తుంటే 3900 రూపాయలు విడిపించు కోవడం కోసం గ్రామైక్య సంఘాలలో తీర్మానం చేసి అట్టి తీర్మానాన్ని సీసీల వద్దకు పంపి చెక్కు రాసి వారు ఓకే అంటనే అప్పుడు మాకు వస్తున్నాయని ఎవరైనా పడి పడక మాపై కొద్దిమంది ఇబ్బందులు పెడుతుంటే కనీసం కొద్దిపాటి వేతనమైన 3900లకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీటిని నేరుగా మా సొంత అకౌంట్లో వెయ్యాలని అంటున్నారు. వీటికి తో పాటు గ్రామైక్య సంఘాలలో 3900 రూపాయలతో పాటు మరో రెండు వేల రూపాయ లు ఆయా గ్రామాల గ్రామైక్య సంఘాలలో పనిచేస్తున్నందున వారికి ఇవ్వాలని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ కొన్ని గ్రామాలలో గ్రామసంఘాలు 2000 రూపాయ లు ఇవ్వడం లేదని మాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. మొత్తం 5900 రూపాయలతో పూట గడవక అప్పుల పాలై పిల్లల చదివించుకోలేక అనేక ఇబ్బందులకు గురవుతున్నామని, ప్రభుత్వం స్పందించి మమ్ములను సర్ఫ్ ఉద్యోగు లుగా గుర్తించి హెల్త్ కార్డులు మంజూరు చేయించి పనికి తగ్గ వేతనం 26 వేల రూపాయల వేతనం అందివ్వాలని 10 లక్షల రూపాయల సాధన బీమా కల్పించి సర్ఫ్ ఐడి నుండి కార్డులు ఇవ్వాలని రాంబాబు సంఘం గ్రేడింగ్‌తో సంబంధం లేకుండా ప్రతినెల వేతనం వ్యక్తిగత ఖాతాలలో జమ చేయాలని తెలుపుతున్నారు. లైవ్ మీటింగ్‌లు రద్దుచేసి అర్హులైన వివోఏలను సీసీలుగా గుర్తించే ఏర్పాటు చేయాలని ఆ సంఘం సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
బిర్రు యాకయ్య, వీవోఏల మండల గౌరవ అధ్యక్షుడు, మదనతుర్తి
ఐకెపి వివోఏలను సెల్ఫ్ ఉద్యోగులుగా తక్షణమే గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించాలి కనీస వేతనం 26వేల రూపాయలు ఇస్తూ 10 లక్షల రూపాయల సాధారణ భీమా సౌకర్యం కల్పించాలని సంస్థల పని చేస్తున్నందుకు సెల్‌ఫోన్ నుండి ఐడి కార్డులు ఇవ్వాలని గ్రామ సంఘం గ్రేడింగ్‌తో సంబంధం లే కుండా ప్రతినెల వివోఏలకు వ్యక్తిగత ఖాతాలో ప్రభుత్వం వేత నం ఇవ్వాలని వివోఎలపై మహిళా సంఘాల ఒత్తిడి ఎక్కువ ఉన్నందున విఎల్ఆర్ అభయహస్తం డబ్బులు ఇవ్వాలని లైవ్ మీటింగ్ రద్దు పరచి అర్హులైన మా వివోఏ లకు సీసీలుగా గుర్తించాలని డిమాండ్ చేస్తున్నాం.
నిమ్మకంటి ఇందిరా, వీవోఏల మండల కన్వీనర్, నైనాల
కొన్ని సంవత్సరాల నుండి గ్రామస్థాయిలో సీఏలుగా విధులు నిర్వహిస్తున్నప్పటికీ మాకు ఇస్తున్నటువంటి వేతనం 39 వందల రూపాయలతో చాలక కుటుంబాలను పోషించు కోలేక మా పిల్లలను చదివించుకోలేక అనేక ఇబ్బందులు ఎదు ర్కొంటున్నామని తక్షణమే ప్రభుత్వం మాపై స్పందించి సెల్ఫ్ ఉద్యోగులుగా గుర్తించి పనికి తగ్గ వేతనాన్ని 26వేల రూపా యలు తక్షణమే కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం.
గుగులోతు హన్మంతు, వీవోఏల మండలాధ్యక్షుడు, ప్రతీరాంతండా
ప్రభుత్వ పథకాలను గ్రామస్థాయిలో ప్రతి గడపకు చేరేం దుకు మా వివోఏలను ప్రభుత్వం వాడుకున్నప్పటికీ స్త్రీల అభివృద్ధి లక్ష్యంగా గ్రామస్థాయిలో వారి గ్రూపులలో ఇప్పిస్తూ లోన్లను రికవరీ చేస్తూ మన రికార్డు రాస్తూ అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ప్రభుత్వం గుర్తించకపోవడం బాధాకరం అంటూ ఇప్పటికైనా మమ్ములను సర్ఫ్ ఉద్యోగుల గుర్తించి లైవ్ మీటింగ్‌లను రద్దుపరిచి ఎవరి ఒత్తిడి లేకుండా నేరుగా మా వ్యక్తిగత అకౌంటులో ప్రభుత్వం ఇచ్చే వేతనం 26 వేలకు రూపాయలకు పెంచి ఇవ్వాలని కోరుతున్నాం. ప్రభుత్వం పెట్టే ప్రతి పనికి కట్టుబడిగా ఉండి పనిచేస్తున్నామని అన్నారు. తక్షణ మే అధికారులు ప్రభుత్వ స్పందించి మనం గుర్తించాలని కోరుతున్నాం.
బానోతు రమేష్, వివోఏ నల్లగుట్ట తండా
గ్రామాలలో గ్రూపుల సభ్యుల రికార్డులు రాస్తూ వాళ్ళు తీసుకున్న అప్పులను వసూలు చేస్తూ వాళ్లకు రుణాలు ఇప్పిస్తూ పెండింగ్‌లో ఉన్నటువంటి గ్రూపుల వద్ద నుండి రికవరీ చేస్తూ ప్రభుత్వం పథకాలు ప్రవేశపెట్టిన అటువంటి వాటిని గ్రామస్థాయిలో ఇంటింటికి అర్థమయ్యేటట్టు తిరిగి ప్రచార నిర్వహిస్తూ ఈ సెల్ఫ్‌లో విధులు వేస్తున్నామని ఎప్పటికైనా మమల్ని గుర్తించి సర్ఫ్ ఉద్యోగులుగా నియమిస్తూ ఎవరితో సంబంధం లేకుండా వ్యక్తిగత ఎకౌంట్లో పనికి తగ్గ వేతనం 26వేల రూపాయలను ఇవ్వాలని కోరుతున్నాం.