Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-మాజీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్యే రాజయ్య
నవతెలంగాణ-స్టేషన్‌ఘన్‌పూర్
నియోజకవర్గ ప్రజలే దేవుళ్ళుగా భావించి, ఉపముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న కాలంలోనే నియోజకవర్గ ప్రజల కోసం తన రెండు కళ్ళు దానం చేశానని, తద్వారా రాబోవు తరాలను చూసుకునే అవకాశం ఉన్నదనే సంతృప్తితో కళ్ళు దానం చేసిన ట్లు మాజీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. బుధ వారం మండలంలోని రాఘవాపూర్ గ్రామంలో రెండో విడత కంటి వెలుగు పథ కాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నేటి నుంచి ఈనెల 21వరకు శిబిరం కొనసాగుతుందని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలం గాణ రాష్ట్రంలో దేశంలో ఎక్కడాలేని విధంగా అనేక సంక్షేమ అబివృద్ధి పథకాలను అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వమన్నారు. కెసిఆర్ నాయకత్వంలో వంద రోజుల్లో కోటిన్నర మందికి కంటి పరీక్షలు చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ సాధించాలనేదే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారన్నారు. కంటి పరీక్షలు చేసుకున్న వారికి అవస రమైతే కంటి అద్దాలు, శస్త్ర చికిత్సలు, మరింత అవసరమైతే కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందించేందుకు కేసీఆర్ ప్రభుత్వం చొరవ చూపుతుందని అన్నారు. సర్వేంద్రియానం నయనం ప్రధానం తీరులో కళ్ళు మాత్రమే లోకాన్ని చూస్తాయని తన కళ్ళతో భవిష్యత్తు కాలంలో ప్రతితరాన్ని చూసుకునే విధంగా ఉపయోగపడ డంపై ఎంతో సంతృప్తి కల్గుతుందని అన్నారు. కంటి వెలుగును విజయవంతం చేయాల్సిన బాధ్యత వైద్య సిబ్బందిపై ఉందని కరోనా విపత్తులో వారి సేవలు అమోఘమని అభినందించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ మారపాక రవి, ఎంపీపీ కందుల రేఖ, సర్పంచ్ కందుల శ్రీలత, పంచాయతీ కార్య దర్శి అనురాధ, వైద్యులు మానస, తదితరులు పాల్గొన్నారు.