Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రఘునాథపల్లి
తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షాలు చేస్తున్న అబద్ధపు కోరుమాటలను ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితిలో లేరని స్టేషన్ఘనపూర్ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ సీఎం డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. బుధవారం రఘునాథపల్లి మండల కేంద్రం లోని ఏఎస్ఆర్ గార్డెన్లో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి బీఆర్ఎస్ అధ్యక్షులు వారాల రమేష్ అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. ఈ సంద ర్భంగా భారీ ర్యాలీ కోలాటం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఎక్క డలేని సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టి పేద ప్రజలు ఆదుకుంటున్నారని అన్నారు. బిజెపి, కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా పుకార్లు చేస్తున్నారని వారి పురకార్లను తిప్పికొట్టేం దుకు పార్టీ నాయకులు సిద్ధంగా ఉండాలని పిలుపు నిచ్చారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం తెలంగాణపై వివక్షత చూపుతోందని ధరలను పెంచుతుందని ఆరో పించారు. ఐదోసారి ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేశానని, మరొకసారి అవకాశం కల్పిస్తే ప్రజలకు నిరంతర సేవ చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా దళితులు ఉన్న నియోజకవర్గం స్టేషన్ఘనపూర్ అని తాటికొండ రాజయ్య తెలిపారు. ప్రతి కార్యకర్తను గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటా ఎల్లవేళలా వారిని ఆర్థికంగా,రాజకీయంగా ఆదుకుంటా నని ఆయన తెలిపారు. కాంగ్రెస్, బిజెపి పార్టీలకు గుణపాఠం తప్పదన్నారు. కేసీఆర్ను, బీఆర్ఎస్ని విమర్శిస్తే పుట్టగతులు ఉండవని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యులు బోల్లం మణికంఠ అజరు, బిఆర్ఎస్ మండ ల అధ్యక్ష కార్యదర్శులు రమేష్ యాదవ్ వారాల, అశోక్ ముసపట్ల, మార్కెట్ కమిటీ చైర్మన్ సిద్ధి లింగం వైస్ చైర్మన్ ముసిపట్ల విజరు, బిఆర్ఎస్ నియోజక వర్గ సోషల్ మీడియా ఇంచార్జి తిప్పారపు రమ్య బాబురావు, సునీత రాజు, శివ కుమార్ గుప్తా పోకల, నామాలబుచ్చయ్య గౌడ్, మార్కెట్ డైరెక్టర్లు యాకస్వామి గౌడ్, శివరాత్రి రాజు, మాల రాజు, దేవస్థానం మాజీ చైర్మన్ చేవెల్లి సంపత్, హైకో ర్టు లాయర్ లోకుంట్ల సుజన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.