Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఏటురు నాగారం ఐటిడిఏ
ఎక్కేలా ప్రాంతంలోని హెచ్ఎంటీసీలో చేపట్టే ఆయిల్ సాగుతో గిరిజనులు మరింత అభివృద్ధి చెందా లని ఐటీడీఏ పీవో అంకిత్ తెలిపారు. బుధవారం పివో ఎక్కిలహెచ్ఎంటీసీ ప్లాంటేషన్‌ను పరిశీలించారు. కాగా 22 ఎకరాల్లో ఉన్న చెట్లు పొదలను తొలగించి సాగుకు సన్నద్ధం చేపించారు. కాగా హార్టికల్చర్ అధికారి రమణ ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఆయిల్ ఫామ్ సాగుకు కషి చేస్తున్నారు. 8 ఎకరాల్లో ఆయిల్ ఫామ్‌తో పాటు ఇప్పటికే రెండు ఎకరాల్లో పెరుగుతున్న మామిడి తోటలు గిరిజ నుల ఎదుగుదలకు ఉపయోగపడాలన్నారు. వీటితో పాటు మిగిలిన ఖాళీ స్థలంలో ఆయా రకాల పండ్ల తోటలను పెంచడానికి ఐటీడీఏ ద్వారా మరిన్ని నిధులను కేటాయించడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ తోటల సాగు పద్ధతులు గిరిజనులకు శిక్షణ కోసం ఉప యోగపడతాయన్నారు. ఈ సాగు విధానం గిరిజనులకు ఒక మోడల్ గా మారుతాయి అన్నారు. ఈ తోటలు డ్రిప్ ఇరిగేషన్ విధానంలో ఉంటాయన్నారు. గిరిజన రైతులు నిరంతరం ఈ పొలాల సాగులో ఉంటూ వారి జీవ నోపాధికి, ఎదుగుదలకు ఈ పంటలు ఉపయోగించుకో వాలన్నారు. హార్టికల్చర్ అధికారి రమణను నిరంతరం వీటి పరిరక్షణలో ఉండాలని ఆదేశించారు.