Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ములుగు
తెలంగాణా నాన్ గెజిటెడ్ అధికారుల సం ఘం(టీిఎన్జీవోస్) ములుగు జిల్లాశాఖ 2023 డైరీ ని గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆవిష్కరించారు. బుధవారం హైదరాబాద్ లోని మంత్రి సత్యవతి రాథోడ్ క్యాంప్ కార్యాలయంలో టీఎన్జీవోస్ జిల్ల అధ్యక్షులు ఠాకూర్ జ్ఞానేశ్వర్సింగ్ అధ్వర్యంలో ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా సత్యవతి రాథోడ్, విశిష్ట అతిథిలుగా టీఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్షులు జేఏసీ చైర్మన్ మామిళ్ల రాజేందర్, ప్రధాన కార్యదర్శి రాయకంటి ప్రతాప్ హాజరై సంఘం డైరీని ఆవిష్కరించారు. ఈ సంద ర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టే ప్రతీ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ దేశం లోనే అతి తక్కువ సమయంలో ఎక్కువ అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తెలంగాణను తీసుకురావడంలో ఉద్యోగుల పాత్ర ఎంతో ఉందన్నారు. ములుగు జిల్లా కేంద్రంలో టీఎన్జీవోస్ భవన నిర్మాణానికి కేటాయించిన స్థలంలో త్వరలోనే భూమి పూజ చేసుకుందామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం లో టీఎన్జీఓస్ రాష్ట్ర అధ్యక్షులు జేఏసీ చైర్మన్ మామిళ్ళ రాజేందర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాయకంటీ ప్రతాప్, ములుగు జిల్లా అధ్యక్షులు ఠాకూర్ జ్ఞానేశ్వర్ సింగ్, జిల్లా కార్యదర్శి పోలు రాజు, వైస్ ప్రెసిడెంట్ కుమారస్వామి,మహిళా విభాగం అధ్యక్షురాలు చైతన్య, సహా కార్యదర్శులు శ్రీవాణి, శ్రీధర్,ఆర్గనైజింగ్ సెక్రటరీ విద్యాసాగర్, కార్యవర్గ సభ్యులు రఘు, టిఎన్జీఓస్ మహిళా విభాగం కమిటీ సభ్యులు సరిత పాల్గొన్నారు.