Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- కోల్ బెల్ట్
తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం( టీబీజీకేఎస్) సింగరేణి కార్మికులకు అండగా ఉంటుందని ఆ సంఘం ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి అన్నారు. జయశంకర్ భూపాల పల్లి జిల్లా కేంద్రంలోని టీబీజీకేఎస్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమా వేశంలో ఆయన మాట్లాడుతూ సింగరేణిలో 49 శాతం వాటా కలిగిన కేంద్రం ప్రైవేటీకరణకు ఎలా పాల్పడుతుందని రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభోత్సవంలో ప్రధాని మోడీ అన్న విషయాన్ని గుర్తు చేశారు. దేశంలో 50శాతం బొగ్గు బ్లాకులు కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే ఉన్నాయని, వాటిని ఓపెన్ గా వేలం ద్వారా దక్కించుకోవాలని, కావా లనుకుంటే సింగరేణి కూడా పాల్గొనవచ్చని చెబుతూనే ఐదు బొగ్గు బ్లాక్లు కోయగూడెం, సత్తుపల్లి, పెనగడప, భూపాలపల్లి కేటికే-6, శ్రావణపల్లిలను వేలం ద్వారా ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించలేదా అని ప్రశ్నించారు. క్రమక్రమంగా సింగరేణిలో ప్రైవేటీకరణను చొప్పిస్తూ సింగరేణి మనుగడ ప్రశ్నార్ధకంగా మారుస్తున్నారన్నారు. సింగరేణిని పూర్తిగా ప్రైవేటు పరం చేయాలనే కుట్ర పన్నుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నైపు ణ్యం కలిగిన కార్మికులు, అపార అనుభవం సంస్థ ఆయన సింగరేణికి వేలంతో సంబంధం లేకుండా ఇతర రాష్ట్రాల మాదిరిగానే బొగ్గు బ్లాకులను అప్ప గించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ప్లాంట్ను అమ్మకానికి పెట్టిన సంద ర్భంగా సీఎం కెసిఆర్ ఆదేశాల మేరకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను సందర్శించామని అన్నారు. అక్కడి ఉద్యోగులు ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణి తీసుకుంటే తమ భవిష్యత్ బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారని తెలిపారు. అధికంగా బొగ్గు ఉత్పత్తి చేసే కోలిండియాలోని 8 బొగ్గు రంగ సంస్థల కంటే సింగరేణిలో మ్యాన్ పవర్ ఎక్కువ ఉన్నదని అన్నారు. అది ప్రతిపక్ష సంఘాలు గ్రహిం చాలని, ప్రతిపక్ష సంఘాలు చేసే విమర్శలు సద్వి మర్శలైతే బాగుంటుందన్నారు. టీబీజీకేఎస్ కార్మికుల సంక్షేమానికే నిత్యం పాటుపడుతుందని అన్నారు. తొమ్మిదవ సారి 11వ వేజ్ బోర్డు చర్చల కు వెళ్తున్న జాతీయ సంఘాలను ఉద్దేశించి పలు వ్యాఖ్యలు చేశారు. 19శాతం మినిమం గ్యారంటీ బెనిఫిట్ ఇప్పించడం గతంలో ఎన్నడూ జరగలేదని కనీసం అలవెన్సులు ఇప్పించడంలోనైనా చొరవ తీసుకోవాలని, పాత డేట్ నుండి అమలయ్యేలా చూడాలని అన్నారు. తద్వారా కార్మికులకు ఆర్థికంగా న్యాయం చేయాలని, ఫ్రీ చేసిన అలవెన్స్ లను ఫ్రీజ్ నుండి తొలగించాలని కోరారు. సింగరేణి ట్రేడ్ యూనియన్ ఎన్నికలు దగ్గరలో ఉన్నందున కార్మికులే సరైన నిర్ణయం తీసు కుంటారని అన్నారు. ఈ సమావేశంలో టీబీజీకేఎస్ భూపాల పల్లి బ్రాంచ్ ఇన్చార్జి నాయకులు బడితల సమ్మయ్య, నాయకులు జక్కిరెడ్డి, రత్నం సమ్మిరెడ్డి, శంకర్ రెడ్డి, సంపత్, బాసనపల్లి కుమారస్వామి, దేవరకొండ మధు తదితరులు పాల్గొన్నారు.