Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కుల వివక్షను అంతం చేద్దాం
- సామాజిక న్యాయాన్ని సాధిద్దాం
- సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాగుల రమేష్
నవతెలంగాణ-సుబేదారి
సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఏప్రిల్ ఆరవ తేదీ నుండి 14వ తేదీ వరకు సామాజిక వారోత్స వాలను సీఐటీయూ హనుమకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యం లో నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం 10కె వాక్ ఫర్ సోషల్ జస్టిస్ నినాదంతో హనుమకొండ లోని గోపాల్ పూర్ నుండి ప్రారంభమైన పాదయాత్ర కాకతీయ యూనివర్సిటీ, నయీమ్ నగర్, పబ్లిక్ గార్డెన్, అంబేద్కర్ సెంటర్, నక్కలగుట్ట ,అదాలత్, సుబేదారి మీదుగా కలెక్టరేట్ వరకు వందలాది మందితో సామాజిక న్యాయం కోసం పాదయాత్ర నిర్వహించి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షులు టి ఉప్పలయ్య అధ్యక్షతన జరిగిన సభలో జిల్లా ప్రధాన కార్యదర్శి రాగుల రమేష్ మాట్లాడారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం నేడు తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటున్న దని అన్నారు. బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగంలో అనేక సవర ణలకు కోరుకుంటున్నదని, రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన అవసరం నేడు కార్మిక వర్గంపై ఉందన్నారు. వాజ్ పారు ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో రాజ్యాంగాన్ని సమీక్షించేం దుకు ఒక కమిషన్ నియమించారని, నేడు మోడీ ప్రభుత్వం రాజ్యాంగం పనికిరాదని నిర్వీర్య కుట్ర పన్నుతున్నారన్నా రు. మనస్మృతిని రాజ్యాంగం స్థానంలో తీసుకొచ్చేందుకు బీజేలసీ ఆర్ఎస్ఎస్ ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. కార్మిక వర్గం ఆర్థిక పోరాటాలతో పాటు సామాజిక పోరా టాలు జమిలిగా నిర్వహించేందుకు శ్రీకారం చుట్టాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ రంగ సంస్థలను ఆదాని, అంబా నీలకు కట్టబెడుతూ ప్రజాసంపదలను మోడీ ప్రభుత్వం లూటీ చేస్తుందని విమర్శించారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వకుండా కార్మిక చట్టాలను రద్దుచేసి కార్మిక హక్కు లను కాలరాస్తున్నారని దుయ్యబట్టారు. జీవించే హక్కు మాట్లాడే స్వేచ్ఛ ప్రశ్నించే హక్కు లేకుండా మోడీ ప్రభుత్వం నిర్బంధాన్ని ప్రయోగిస్తోందన్నారు. రాబోవు కాలంలో ప్రజా స్వామ్య పరిరక్షణ కోసం కార్మిక వర్గం ఐక్యంగా ఉద్యమిం చాలని అన్నారు. నేటికీ అంటరానితనం కుల వివక్ష పెద్ద ఎత్తున ఉందని, దీనికి వ్యతిరేకంగా కార్మిక వర్గం ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు. సీఐటీయూ జిల్లా ఆఫీస్ బేరర్స్ గాదె ప్రభాకర్ రెడ్డి ,బొట్ల చక్రపాణి ,వేల్పుల సారంగపాణి ,మెట్టు రవి ,పుల్ల అశోక్, బొల్లారం సంపత్, బి మహేష్ ,ఎన్ రజిత,ఎన్ కుమార్ ,రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎం చుక్కయ్య, గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి వి వీరన్న, ఐద్వా జిల్లా కార్యదర్శి ఎల్ దీప పాల్గొన్నారు.
దేశాన్ని రక్షించుకుందాం : సీఐటీయూ
జనగామ : జనగామ: దేశాన్ని రక్షించుకుందాం రాజ్యాంగాన్ని కాపాడుకుందాం సామాజిక అసమానతలు లేని సమాజం కోసం పోరాడుదామని నినదిస్తూ సిఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం స్థానిక రైల్వే స్టేషన్ నుండి కలెక్టరేట్ వరకు సామాజిక న్యాయ పాదయాత్ర కార్యక్రమం చేపట్టారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట కేంద్ర బిజెపి ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ధర్నా కార్యక్రమం నిర్వహించి డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టరేట్ ఏవో మన్సూర్ కి అందజేశారు. జిల్లా కార్యదర్శి రాపర్తి రాజు హాజరై మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 6 నుండి 14వ తేదీ వరకు సిఐటియు వ్యవస్థాపక అధ్యక్షులు బిటి రణదీవే వర్ధంతి నుండి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వరకు సామాజిక న్యాయ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. సామాజిక న్యాయం, భారత రాజ్యాంగం పరిరక్షణ కోసం, కుల వివక్షత నిర్మూలన కోసం, మనుషులంతా సమానం,అంటరానితనం నిర్మూలన కోసం, ప్రభుత్వ రంగాల పరిరక్షణ కోసం, కనీస వేతనాలు అమలు కోసం, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని, రిజర్వేషన్ల సాధన కోసం ఈ పాదయాత్ర నిర్వహించామన్నారు. సామాజిక న్యాయం, సంపద, విద్య వైద్యం అనేక రంగాల్లో సమభాగాల్లో ఉండాలని, ప్రభుత్వ రంగ సంస్థలను ఉపాధి అందరికీ లభించాలని, చట్టాలు పాలకుల వరకే పరిమితం కాకుండా ప్రజలందరికీ ఉపయో గపడాలన్నారు. రాబోయే రోజుల్లో కార్మిక హక్కుల సాధన కోసమే సీఐటీయూ పోరాటాలు నిర్వహిస్తుందని తెలిపారు. జిల్లా అధ్యక్షులు బొట్ల శ్రీనివాస్ జిల్లా కోశాధికారి సుంచు విజయేందర్, జిల్లా ఉపాధ్యక్షులు అన్నేబోయిన రాజు, జిల్లా సహాయ కార్యదర్శులు చిట్యాల సోమన్న, కోడెపాక యాకయ్య జిల్లా నాయకులు పొదల నాగరాజు, వడ్డేపల్లి బ్లెస్సింగ్ టన్, బూడిది ప్రశాంత్, బైరగోని బాలరాజు గౌడ్ కడారి ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.
సామాజిక న్యాయం కోసం పాదయాత్ర
తాడ్వాయి : బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి, మహాత్మా జ్యోతి రావు ఫూలే జయంతి, సీఐటీయూ వ్యవస్థాపక అధ్యక్షులు కామ్రేడ్ బీజీ రనదివే వర్ధంతి సందర్భంగా ఏప్రిల్ 6 నుండి 14 వరకు జరుగు సామజిక న్యాయ వారోత్సవాలు జరుపాలనే సీఐటీయూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కాటాపూర్లో గురువారం సీఐటీయూ ఆధ్వర్యంలో సామాజిక న్యాయ పాదయాత్ర నిర్వహించారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఎండి దావుద్ జెండా ఊపి ప్రారంభించారు. జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్ పాల్గొని మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా సామాజిక న్యాయం, భారత రాజ్యాంగం పరిరక్షణ, కుల వివక్షత నిర్మూలన, తదితర వాటికోసం పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మతం పేరుతో ప్రజలు, కార్మికుల్లో చిచ్చు పెడుతున్నదని, దళితులు గిరిజనులు, మైనార్టీలు, మహిళలపై విచ్చలవిడిగా దాడులు చేస్తున్నారని ధ్వజమెత్తారు. దళిత, గిరిజన బలహీన వర్గాలకు రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లకు బిజెపి గండి కొడుతున్నదని తెలిపారు. నూతన విద్యా విధానం పేరుతో మను వాద సిద్ధాంతాన్ని విద్యా విధానంలోకి చోప్పించి అమలు చేస్తుందని అన్నాఉ. కార్మికులు పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను, నాలుగు లేబర్ కోడ్ లుగా మార్చి కార్మికులను కట్టు బానిసలుగా మార్చివేస్తు న్నారని తెలిపారు. ఈ దుర్మార్గ విధానాలను ప్రతిఘటిస్తున్న ప్రజలు కార్మికులు, ఐక్యం కాకుండా మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్నదన్నారు. అన్ని రకాల దోపిడీల నుండి సంపూర్ణ విముక్తి కోసం సీఐటీయూ పోరాటం చేస్తుందని అన్నారు. గిరిజన సంఘం జిల్లా నాయకులు దుగ్గి చిరంజీవి, సీఐటీయూ భవన నిర్మాణ కార్మికుల సంఘం అధ్యక్షులు చిట్టీనేని శ్రీనివాస్, ఉపాధ్యక్షులు నామని శంకర్, సత్యనా రాయణ, నర్సింగ రావు, సమ్మక్క, రమా దేవి, సుధా రాణి, ఎట్టి నరేష్, నిర్మల, కష్ణా, కవిత, యాకయ్య పాల్గొన్నారు.