Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
ఆన్లైన్ గేమ్స్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ఆరుగురు సభ్యులు గల ముఠాను మిల్స్‌కాలనీ పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం ఈ మేరకు పోలీసు కమిషనరేట్‌లో సెంట్రల్ జోన్ డిసిపి అబ్దుల్ బారి ఈ కేసు వివరాలను వివరించారు. నిందితుల నుండి రూ.10 లక్షల విలువైన మూడు ల్యాప్ టాప్‌లు, 13 సెల్ఫోన్లు, రూ.1.90 లక్షల నగదు, ఒక ద్విచక్ర వాహనం, వివిధ బ్యాంకుల డెబిట్, క్రెడిట్ కార్డులు, చెక్కు బుక్కులను స్వాధీనం చేసుకు న్నారు. ఛత్తీస్‌ఘడ్ రారుచూర్కు చెందిన పఠాన్షా (23), పటాన్ ఖాసీంఖాన్ (28), ఓడిషాకు చెందిన చాందిని నాగ్ (27),తోపాటు సయ్యద్ సల్మాబేగ్ (26), ఖమ్మానికి చెందిన మొగల్ మున్నా (19), గుంజ కళ్యాణ్ (20) ముఠాగా ఏర్పడి సులభంగా డబ్బు సంపాదించాలనుకొని ఆన్లైన్ బెట్టింగ్ యాప్ ద్వారా బెట్టింగ్‌ను ప్రారంభించార న్నారు. ఆన్లైన్లోనే ఈ ముఠా ముందుగా కొంత మొత్తంలో డబ్బు డిపాజిట్ చేయాల్సి వుంటుంద న్నారు. డబ్బును డిపాజిట్ చేసిన వ్యక్తులకు ఈ బెట్టింగ్నిర్వాహకులు యూజర్ నేమ్‌తోపాటు పాస్ వర్డ్ ఇస్తారన్నారు. దీని ద్వారా ఆన్లైన్ బెట్టింగ్ వ్యవహారం కొనసాగుతుందని చెప్పారు. గత కొద్ది రోజుల క్రితం ఇండియన్ క్రికెట్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం కావడంతో ఈ బెట్టింగ్ ముఠా ఐపిఎల్ క్రికెట్‌పై జోరుగా బెట్టింగ్ నిర్వహించిందన్నారు. అందులో గెలిచిన వారికి రెండింతల డబ్బును అందచేసేవారన్నారు. ఈ ముఠా గతంలో ఖమ్మం కమిషనరేట్ పరిధిలో కూడా బెట్టింగ్ నిర్వహించిందన్నారు. వరంగల్ ఓసిటి కేంద్రంగా బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లుగా సమాచారం రావడంతో మిల్స్ కాలనీ పోలీసులు బుధవారం సాయంత్రం బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లుగా పోలీసులకు సమాచారం రావడంతో మిల్స్ కాలనీ పోలీసులు బుధవారం సాయంత్రం బెట్టింగ్ నిర్వహిస్తున్న ఇంటిపై దాడి చేసీ ఈ ముఠాను అదుపులోకి తీసుకొని వారి నుండి ల్యాప్‌టాప్‌లు, డబ్బులు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకొని తదుపరి విచారణ నిమిత్తం మిల్స్ కాలనీ పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ ముఠాను పట్టుకోవడంలో ప్రతిభ కనపరిచిన వరంగల్ ఎసిపి బోనాల కిషన్, మిల్స్ కాలనీ, సైబర్ క్రైమ్స్ ఇన్స్పెక్టర్లు ముస్కా శ్రీనివాస్, జనార్ధన్‌రెడ్డి, సైబర్ క్రైమ్ ఏఏఓ ప్రశాంత్, మిల్స్ కాలనీ ఎస్సై కుమార్, ఎఎస్సై స్వరూప, కానిస్టేబుళ్లు భావుసింగ్, వీరన్న, హౌంగార్డు నాగేశ్వర్రావును డిసిపి అభినందించారు.