Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పూలే, అంబేద్కర్ సందేశ్ యాత్ర
నవతెలంగాణ- కోల్బెల్ట్/భూపాలపల్లి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని పలు కాలనీలలో గురువారం కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం(కేవీపీఎస్) ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. మహనీయుల జయంతుల మాసం సందర్భంగా వారి ఆశయాల ప్రచారం కోసం పూలే, అంబేద్కర్ సందేశ్ యాత్ర బైకు ర్యాలీ ఈనెల ఆరవ తేదీన కాటారం మండల కేంద్రంలో ప్రారంభమై మహాదేవపూర్ మహాముత్తారం, టేకుమట్ల, మొగుళ్ళపల్లి, చిట్యాల, రేగొండ, ఘనపూర్ మండల కేంద్రాల వివిధ గ్రామాల మీదుగా గురువారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కొనసాగింది. ఈ సందర్భంగా కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి గుర్రం దేవేందర్ మాట్లాడుతూ... సమాజంలో అంటరాని తనం, కులవ్యవస్థ, ఆర్థిక అసమానత్వం రూపుమాప డానికి మహనీయులు జగ్జీవన్ రామ్, జ్యోతిబా పూలే, అంబేద్కర్ పోరాటాలు చేశారన్నారు. నేటికీ మహనీయులు కలలు కన్న సమసమాజం సిద్దించక పోగా అణిచివేత దాడులు పెరుగుతున్నాయన్నారు. రాజ్యాంగం ద్వారా అందరికీ సమాన హక్కులు కల్పించిన అంబేద్కర్ స్ఫూర్తిని దెబ్బతిస్తూ రాజ్యాంగ హక్కులన్నీ హరించి వేస్తున్నారని అన్నారు. రాజ్యాంగాన్ని మార్చాలని మనువాద శక్తులు కుట్ర పన్నుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంబేద్కర్ ఆశయాల కొనసాగింపుగా రాజ్యాంగాన్ని రక్షించుకో వాలని అన్నారు. నేటి ప్రభుత్వాలు ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటు రంగానికి దారాధత్తం చేస్తూ, దళిత,బడుగు, బలహీన వర్గాలకు విద్యా,ఉద్యోగ, ఉపాధి లను దూరం చేస్తున్నాయని దుయ్యబట్టారు. రిజర్వేషన్లను సరైన రీతిలో అమలు చేయకుండా అగ్రవర్ణాలకు అవకాశాలు, అధికారాలు కట్టబెడుతూ...అత్యధికంగా ఉన్న జనాభాకు రిజర్వేషన్ ఫలాలు అందని ద్రాక్షాలా నేటి పాలకులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అంబేద్కర్ జయంతి సందర్బంగా నేడు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వంద పడకల ఆసుపత్రిలో జరిగే రక్తదాన సేవా కార్యక్ర మం చేపడుతున్నామన్నారు. నాయకులు, కార్యక ర్తలు, సామాజిక సంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. జిల్లా అధ్యక్షులు ఇసునం మహేందర్ , నాయకులు శ్రీధర్, మహేష్, రాజేందర్, రాజు, సదన్న, సారన్న, శ్రీనివాస్, రమేష్, మల్లేష్, నరసన్న, పుల్ల సజన్ తదితరులు పాల్గొన్నారు..