Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొమురంబీం విగ్రహాన్నిపోలీస్స్టేషన్లో పెట్టిన చరిత్ర కాంగ్రెస్‌దే
- అంబేద్కర్ విగ్రహవిష్కరణలో జెడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్
నవతెలంగాణ-మహదేవ్పూర్
నాడు బ్రాహ్మణీయ పాలనలో వారు చెప్పిన మాటలు విని బీఆర్ అంబేద్కర్‌ను బీసీలు దోషిగా చూశారని, బీసీలకు అంబేద్కర్ ద్రోహం చేసిండని చెప్పితే నమ్మారని జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ వివరించారు. మహదేవ్పూర్ మండలం పల్గుల గ్రామంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని భూపాలపల్లి జిల్లా పరిషత్ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిణీ రాకేష్‌తో కలిసి ఆయన గురువారం ఆవిష్కరించి మాట్లాడారు. భవిష్యత్తరాల కోసం నాడు ఎంతోమంది మహనీయులు పోరాటం చేశార ని, అనేక త్యాగాలు చేశారని గుర్తు చేశారు. అనేక వాస్తవ విషయాలు తెలుసుకోకపోవడానికి బ్రాహ్మ ణీయ పాలన కారణం కాదా అని అన్నారు. నాడు కాంగ్రెస్ హయాంలో ఇక్కడ ఎమ్మెల్యే అధికారంలో ఉండి మంథనిలో దళిత బిడ్డ ఎంపీ సుగుణకుమారి అంబేద్కర్ విగ్రహాన్నిఏర్పాటు చేస్తే ఆవిష్కరణకు 144సెక్షన్ విధించిన చరిత్ర ఉందని అన్నారు. కాటారం మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహ ఆవి ష్కరణకు రాకుండా 144సెక్షన్ అమలు చేశారని గుర్తు చేశారు. మహదేవ్పూర్, మహాము త్తారంలో కొమురం భీం విగ్రహం పెట్టకుండా అడ్డుకు న్నారని అన్నారు. నాడు విగ్రహవిష్కరణకు వచ్చి కవితక్కను పోలీస్‌స్టేషన్‌కు తరలించి కొమురం భీం విగ్రహాన్ని పోలీస్‌స్టేషన్‌లో పెట్టించిన ఘనత కాంగ్రెస్ పాలకు లకే దక్కిందన్నారు. బీసీ బిడ్డగా తాను ఎమ్మెల్యేగా అయిన తర్వాత నియోజకవర్గంలో మహనీయుల వి గ్రహాలను నెలకొల్పి వారి చరిత్రను చాటి చెప్తున్నానని అన్నారు. అంబేద్కర్, పూలే లాంటి మహనీయుల గు రించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలన్నారు. బీసీలు ఎస్సీలు కలిసి విగ్రహా ఆవిష్కరణ చేసుకోవడం అభినందనీయమని అన్నారు.
రాజ్యాంగ స్పూర్తితోనే రాష్ట్ర అభివృద్ధి
అంబేద్కర్ రచించిన రాజ్యాంగ స్పూర్తితోనే నాడు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు జరిగిందని, అన్ని రంగాల్లో అభివృధ్దికి బాటలు పడ్డాయని భూపాలపల్లి జిల్లా పరిషత్ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిణీ రాకేష్ అన్నారు. రాజ్యాంగం ద్వారానే తనతో పాటు ఎంతో మంది అనేక పదవుల్లో ఉన్నారని గుర్తు చేశారు. గిరిజన బిడ్డ ద్రౌపతి ముర్మూను దేశ ప్రధానిగా చేసిన రాజ్యాంగం ఎంతో గొప్పదన్నారు. హైదరా బాద్ నడిబొడ్డున 125అడుగుల బారీ విగ్రహాన్ని ఆవిష్కరించు కోబోతున్నామని చెప్పారు. మహనీ యుల చరిత్ర తెలుసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఎంపీపీ రాణి బారు, జెడ్పిటిసి గూడాల అరుణ, అన్నారం ఎంపీటీసీ మంచినీళ్ల దుర్గయ్య, సర్పంచ్ మానం లసమయ్య, ఉపసర్పంచ్ మచ్చ వెంకటేష్ అంబేద్కర్ విగ్రహ కమిటీ అధ్యక్షులు వడ్లకొండ సమ్మయ్య, ఉపాధ్యక్షులు నిట్టూర్ శంకరయ్య, పోతల శ్యామ్, సర్పంచ్ శ్రీపతి బాబు, మంథని నియోజకవర్గ బీసీ మహిళా అధ్యక్షురాలు గీత గీతా బారు,పలిమెల అధ్యక్షులుజవ్వాజి తిరుపతి, కాళేశ్వరం ఎంపీటీసీ మమత నాగరాజు, సర్పంచ్ వసంతం మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.