Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీసీఈబీ సెక్రెటరీ చంద్రశేఖర్
నవతెలంగాణ-చిట్యాల
టైం టేబుల్ ప్రకారం పరీక్షలు నిర్వహించాలని టిసి సెక్రెటరీ ఓ చంద్రశేఖర్ అన్నారు. గురువారం మండలంలోని ఆదర్శ పాఠశాల, కాకతీయ హై స్కూల్, జిల్లా పరిషత్ హై స్కూల్లను సందర్శించారు. ఈ సందర్భంగా డీసీఈబీ సెక్రెటరీ చంద్రశేఖర్ మాట్లాడుతూ టైం టేబుల్ ప్రకారంగా పరీక్షలు నిర్వహించాలని, రోజువారిగా సబ్జెక్టును పరిశీలించి విద్యార్థులకు అందజేయాలన్నారు. సమయ పాలన పాటించాలని, ఎలాంటి అవకతవకలకు తావు ఇవ్వరాదని తెలిపారు. విద్యార్థులకు ఆరోగ్య రీతిలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అవకతవకలు జరిగితే హెడ్మాస్టర్లు బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ప్రైవేటు స్కూలు అయితే పాఠశాల అనుమతి రద్దు చేసి చర్యలు తీసుకుంటామన్నారు. అసిస్టెంట్ సెక్రటరీ శనిగరపు భద్రయ్య ప్రిన్సిపాల్ శేఖర్, ప్రధానోపాధ్యాయులు ఎస్.రఘుపతి, రాజు మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు.