Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు
నవతెలంగాణ- వాజేడు
రాష్ట్రవ్యాప్తంగా తునికాకు కార్మికులకు 2016 నుంచి 2021 వరకు 200 కోట్ల రూపాయలు బోనస్ పెండింగ్ ఉందని, పెండింగ్ డబ్బులు తునికాకు కార్మికులకు చెల్లించిన తరువాతే ఆకు సేకరణ చేపట్టాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చ వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. గురువారం వాజేడు మండల కేంద్రంలో జరిగిన పార్టీ జనరల్ బాడీ సమావేశంలో మచ్చ వెంకటేశ్వర్లు మాట్లాడారు. తునికాకు కార్మికులు మండుటెండను సైతం లెక్కచేయకుండా చెమటోడ్సి సేకరించిన తునికాకుకు కాంట్రాక్టులు ఇచ్చే డబ్బులు మాత్రమే చెల్లించి ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సిన బోనస్ పెండింగ్ పెట్టారన్నారు. 2016 నుంచి ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని కార్మి కులకు రావాల్సిన రూ.200 కోట్లు ఫారెస్ట్ అధికారుల వద్ద పెట్టుకొని చోద్యం చూస్తున్నారని అన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం సహకారంతో బోనస్ డబ్బులు మంజూరు చేసుకున్నప్పటికీ ఫారెస్ట్ అధికారులు మాత్రం చెల్లింపులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నా రు. ఫిబ్రవరి నెలాఖరు నాటికి పూర్తిగా చెల్లిస్తామని సిసిఫ్ హామీ ఇచ్చినప్పటికీ ఏప్రిల్ వచ్చినా ఇప్పటివరకు ఎక్కడ కూడా చెల్లింపులు చేపట్టలేదని అన్నారు. బోనస్ చెల్లించకుండానే తునికాకు సేకరణకు మళ్లీ సిద్ధమవుతున్నారని, ఫారెస్ట్ అధికారులు ప్రభుత్వం ఇంకెంతకాలం పెండింగ్లో పెడతారని బోనస్ చెల్లించకుండా తునికాకు సేకరణ చేపట్టాలని చూస్తే ప్రతిఘటిస్తామని అన్నారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు సూడి కష్ణారెడ్డి,జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకటరెడ్డి,జిల్లా నాయకులు దబ్బకట్ల లక్ష్మయ్య,పార్టీ మండల కార్యదర్శి కొప్పుల రఘుపతిరావు, నాయకులు బచ్చల కష్ణబాబు, జజ్జరి దామోదర్, బచ్చల సౌమ్య,వాదం పోతురాజు, ఆదినారాయణ,రామయ్య , కౌసల్య, సీత,కుమారి,సత్యనారాయణ,తదితరులు పాల్గొన్నారు.