Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్ యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్
నవతెలంగాణ-భూపాలపల్లి
ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతి ప్రక్రియను వెంటనే కొనసాగించాలని టీఎస్ యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి శనిగరపు రమేష్ డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ పదవ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని గురువారం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠ శాలలో జిల్లా అధ్యక్షుడు సీహెచ్ రఘుపతిరెడ్డి ఉద్యమ పతాకాన్ని ఆవిష్క రించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్యారంగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో యుటిఎఫ్ నిరంతరం పోరాటం చేస్తుందని అన్నారు. ఐక్య ఉద్యమాలకు నాంది పలికిందని, ఉద్యోగ- ఉపాధ్యా య పెన్షనర్ల ఐక్య వేదిక ఏర్పాటులో కీలక పాత్ర పోషించి పీఆర్సీ సాధన కోసం ఉద్యమం చేసిందని అన్నారు. మెరుగైన వేతన స్కేలు కోసం ప్రయత్నించిందని గుర్తు చేశారు. పండిట్-పిఈటీల పోస్టుల అప్గ్రేడేషన్ కొరకు ,ఉపాధ్యాయులకు పదోన్నతులు, పాఠశాలల్లో ఉపాధ్యాయ ఖాళీల భర్తీ కోసం నిరంతరం పోరాటం చేస్తున్నదని అన్నారు. జీవో 317 అమలులో జరిగిన లోటుపాట్లను సరి చేయడానికి ప్రభుత్వం ముందుకు రావాలని డిమాండ్ చేశారు. హైకోర్టు తీర్పు కారణంగా ఉపాధ్యాయుల బదిలీలు- పదోన్నతుల ప్రక్రియ ఆగిపోయినందున ప్రక్రియను వేగవంతం చేసి ఈ వేసవి సెలవుల్లోనే ప్రక్రియను ముగించాలని విజ్ఞప్తి చేశారు. మన ఊరు - మన బడి కార్యక్రమా న్ని పారదర్శకంగా అమలు చేయాలని, ఆయా పాఠశాలలకు కావలసిన అన్ని మౌలిక సదుపాయాలను కల్పించాలని కోరారు. సిపిఎస్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ యుటిఎఫ్ ఎన్నో పోరాటాలు చేసిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ప్రతి నెల ఒకటవ తేదీన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉపాధ్యాయులకు వేతనాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు రామ్ నాయక్ , సీనియర్ నాయకులు మల్లికార్జున్, తిరుపతి, సోషల్ మీడియా కన్వీనర్ ఈశ్వరా చారి , నాయకులు సంపత్ ,రాజు ,సదయ్య ,వందన తదితరులు పాల్గొన్నారు.