Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఐసీసీ జాతీయ నేత, ఎమ్మెల్యే సీతక్క
నవతెలంగాణ - ములుగు
యూత్ కాంగ్రెస్ శ్రేణులు అధికారమే లక్ష్యంగా పార్టీ కోసం పని చేయాలనీ కాంగ్రెస్ పార్టీ జాతీయ నేత, ఎమ్మెల్యే డాక్టర్ సీతక్క పిలుపునిచ్చారు. ములుగు జిల్లా కేంద్రంలో యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు భానోతు రవిచందర్ అధ్వర్యంలో రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివసేన రెడ్డి పిలుపు మేరకు ఏఐసీసీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆదేశాల మేరకు యూత్ జోడో బూత్ జోడో వన్ బూత్ఫై గురువారం యూత్ ప్రోగ్రాం ఇన్చార్జి రమేష్‌బాబు హాజరై యూత్ కాంగ్రెస్ నాయకులకు అవగా నహ కల్పించారు. ఎమ్మెల్యే సీతక్క హాజరై మాట్లాడారు. 1200మంది విద్యార్థుల త్యాగాల పునాదులపై గద్దె నెక్కినకేసీఆర్ ఒక్క ఉద్యోగం ఇచ్చిన పాపాన పోలేదన్నారు. తెలంగాణ లో లీకేజీ పాలన కొనసాగుతుందని, లీకేజీ వెనుకాల ఉన్న వారిని కటినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దేశంలో రోడ్లు,రైల్వే, ఎల్ఐసి వంటి అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్ని మోడి మిత్రులైన ఆదాని ,అంబానీలకు కట్టబెడుతున్నారన్నారు. రాహుల్ గాంధీ పార్లమెంట్ లో మోడీన ప్రశ్నిస్తే కక్ష సాధింపు చర్యలు చేపట్టారన్నారు. రాహుల్ గాంధీకి అండగా యూత్ కాంగ్రెస్ నాయకులు పోరాటాలకు సిద్దం కావాలన్నారు.
ముఖ్య మంత్రి సహాయ నిధి చెక్కులు అందజేత
వెంకటాపూర్ మండలంలోని పాలంపేటకు చెందిన బొమ్మ పూర్ణ చందర్ కు మంజూరైన రూ.60వేల విలువైన చెక్కును, రామాంజాపూర్ గ్రామానికి చెందిన గాదె నర్సయ్యకు రూ.12500, జవహర్ నగర్ గ్రామానికి చెందిన జమునకు రూ. 25000 చెక్కు, విరగాని సదానందంకు రూ.22500 చెక్కును ఎమ్మెల్యే సీతక్క తన క్యాంప్ కార్యాలయంలో అందించారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే వెంట కిసాన్ సెల్ జిల్లాఅధ్యక్షులు గొల్లపెల్లి రాజేందర్,యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానో త్ రవి చందర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బై రెడ్డి బాగ్వాన్ రెడ్డి, జిల్లా సీనియర్ నాయకులు శ్యామ్ సుందర్ రెడ్డి,మండల అధ్యక్షులు ఎండీ చాంద్ పాషా, సహకార సంఘం వైస్ చైర్మన్ మర్రి రాజు,సర్పంచ్ గండి కల్పన కుమార్, యూత్ కాంగ్రెస్ నియోజక వర్గ వర్కింగ్ కమిటీ అధ్యక్షులు ఈసర్ ఖాన్, యూత్ జిల్లా ప్రధాన కార్యదర్శి రేవంత్ యాదవ్, ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షులు కోటి,జిల్లా అధికార ప్రతినిధి వంశీ కృష్ణ, మాజీ జెడ్పీటీసీ బోళ్లు దేవేందర్, మాజీ వర్కింగ్ కమిటీ అధ్యక్షులు బండి శ్రీనివాస్, కిసాన్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి,ఉప సర్పంచ్ సాదు రాజు, తదితరులు ఉన్నారు.