Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కే.సోమశేఖర్
నవతెలంగాణ-హన్మకొండ
ఉపాధ్యాయ సమస్యల పరి ష్కారంలో టీఎస్ యుటిఎఫ్ రాజీ లేని పోరాటం చేస్తూ ఈ రాష్ట్రంలో అగ్రగామిసంఘంగా ఉందని టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కే సోమ శేఖర్ అన్నారు. గురువారం టీఎస్ యుటిఎఫ్ పదవ ఆవిర్భావ ది నో త్సవాన్ని పురస్కరించుకొని దీన్ ద యాల్ నగర్‌లోని టీఎస్ యుటిఎఫ్ జిల్లా కార్యాలయంలో టీఎస్ యుటి ఎఫ్ పతాకావిష్కరణ చేశారు.
ఈ సందర్భంగా మా ట్లాడుతూ హక్కులు, బాధ్యతలు రెండు నేత్రాలుగా విద్యారంగ పరిరక్షణ కోసం టీఎస్ యుటిఎఫ్ నిరంతర పోరాటాలు, ఐక్య ఉద్యమాలు చేస్తుందని అన్నారు. ఉపాధ్యాయుల అనుభవిస్తున్న అనేక సౌకర్యాల కోసం అనేక జీవోలు రావడంలో టీఎస్ యుటిఎఫ్ పోరాటాలు దాగిఉన్నాయన్నారు. ఉపాధ్యాయులకు త్వరలో బ దిలీలు, పదోన్నతులు నిర్వహించకపోతే టీఎస్ యుటిఎఫ్ ఆధ్వర్యంలో పోరాట కార్యక్రమాలకు పిలుపునిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఇంకా టీఎస్ యుటిఎఫ్, హనుమకొండ జిల్లా అధ్యక్ష ప్ర ధాన కార్యదర్శులు ఏం సదాశివరెడ్డి, పెండెం రాజు, వరంగల్ జిల్లా అధ్యక్షులు తా టికాయల కుమార్, ఉపాధ్యక్షులు మేకిరి దామోదర్, కోశాధికారులు డి కిరణ్ కుమార్, సి.సుజన్ ప్రసాద్‌రావు జిల్లా కార్యదర్శులు జి భాస్కరరావు, పి చంద్ర య్య, బి.వెంకటేశ్వరరావు, సిహెచ్.లింగారావు, జీ.కరుణాకర్, రమేష్, శ్రీనివాస్, అంజాద్ అలీ తదితరులు పాల్గొన్నారు.