Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేవీపీఎస్ బైక్ యాత్ర ముగింపు సభలో కేయూ ప్రొఫెసర్ గడ్డం కృష్ణ
నవతెలంగాణ-హన్మకొండ
కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ జి ల్లా వ్యాప్త బైక్ యాత్ర గత నాలుగు రోజులుగా హనుమ కొండ జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలు. పలు గ్రామా ల గుండా కొనసాగి గురువారం అంబేద్కర్ విగ్రహం వ ద్దకు చేరుకుంది. ఇక్కడ ముగింపు కార్యక్రమం చేపట్టా రు. ఈ ముగింపు సమావేశానికి కెవిపిఎస్ గౌరవ అధ్య క్షులు కేయూ ప్రొఫెసర్ గడ్డం కృష్ణ మాట్లాడుతూ తర తరాలుగా బానిసలుగా బతికిన దళితుల స్థితిగతులు తెలిసినా కెవిపిఎస్ మరింత అధ్యయనం చేసేందుకు. వారి పరిస్థితుల్ని మరింత అవగాహన చేసుకునేందుకు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దళిత వ్యతిరేక విధానాలను వారందరికీ వివరించి. భవిష్యత్తు పోరాటాలకు దళితులను సంసిద్ధం చేసేందుకు ఈ బైక్యాత్ర ఎంతో ఉపయోగపడుతుందని అలాంటి ప్రయత్నం ఈ మండుటెండలో కేవీపీఎస్ చేయడం అభినందనీయమని అన్నారు. పోరాటాల ద్వారానే మన హక్కుల్ని సాధించుకోవాలని.. అడుక్కుంటే బిక్షగాళ్ళం అవుతామని. అది పోరాడి సాధించుకుంటే రాజులమవుతామని.. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఏనాడో సూచించారని ఆ మహా నీయుల స్ఫూర్తితో పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మంద సంపత్ మాట్లాడుతూ. 75 సంవత్సరాల స్వతంత్ర భారత దేశంలో దళితుల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అనే విధంగా ఉందని. ఓట్ల కోసం దళితులకు ఇచ్చిన వాగ్దానాలను ఏ ఒక్క ప్రభుత్వం నెరవేర్చలేదన్నారు. ముగింపు సమావేశానికి రైతు సంఘం జిల్లా కార్యదర్శి. సిఐటి జిల్లా అధ్యక్షులు టీ.ఉప్పలయ్య, రజక సంఘం జిల్లా కార్యదర్శి కంచర్ల కుమారస్వామి హాజరై తమ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ మాట్లాడారు. ఈ సమావేశంలో కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు ఓరుగంటి సాంబయ్య. ఉపాధ్యక్షులు దూడపాక రాజేందర్. జడ రమేష్. పొట్ల పెళ్లి రాజు. సురేష్. బుట్ల కుమార్. చరణ్ . చెరుకు ఐలయ్య. మామిడి నాగరాజు. రేణిగుంట్ల సుమన్. రేణిగుంట్ల చందర్. బొచ్చు ప్రభాకర్. తిప్పారపు నాగరాజు. పవన్. దూడపాక మొగిలి. కొండపాక శ్రావణ్. కార్తీక్. సాయి కష్ణ బైక్ యాత్ర బందంలో పాల్గొన్నారు.