Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతును కాపాడుకోవాలనే సీఎం కేసీఆర్ ప్రత్యేక ప్యాకేజీ విడుదల
- రాజకీయాలకు అతీతంగా నష్టపరిహారం అందజేత
- ఈజీఎస్‌ను వ్యవసాయానికి అనుసంధానం చేసే వరకు కొట్లాడుడే
- చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి భావోద్వేగం..
నవతెలంగాణ-నర్సంపేట
'రైతు కష్టమెంటో తెల్సినోడిని..ఆపద సమయం లో మీవెంటే ఉన్నోడిని..ఆరుగాలం చమటోడ్చి పం డించిన పంట చేయిజారితే ఎంతటి బాధ ఉంటోందో తెల్సినోడిని..కిందటేడాది జనవరి 11న వడగండ్ల వానకు పంటలు దెబ్బతినగా సీఎం కేసీఆర్‌ను ఒప్పిం చి ప్రత్యేకంగా నియోజకవర్గానికి రూ. 8.50 కోట్ల నష్ట పరిహారం పట్టుకొచ్చి మీ చేతికి అందజేస్తున్న మీ బిడ్డను నిండుమనస్సుతో ఆశీర్వదించండి.. ఇటి వల దెబ్బతిన్న పంటలను సీఎం కేసీఆర్ సందర్శించి రైతు కన్నీరును తుడ్చాడు..రైతును కాపాడుకోవాలని ఎకరాకు రూ.10 వేల నష్ట పరిహారం ప్రకటించారు. దెబ్బతిన్న 38వేలఎకరాలపై రూ.38 కోట్లు తీసుకొ చ్చి మీ చేతికి అందించే పూచి నాది' అంటూ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి భావోద్వేగంతో ప్రసంగించారు. గురువారం మండలంలోని మాధన్నపేట క్లస్టర్ గ్రా మంలో నిర్వహించిన పం ట నష్టపరిహారం చెక్కు ల పంపిణీ కార్యక్రమంలో ఎ మ్మెల్యే మాట్లాడుతూ ఓ రైతు పొలంలో పంట పం డించడానికి ఎంతటి కష్టపడుతాడో చిననాటి నుంచే మా నాయనను చూసి తెల్సుకున్నాన్నారు. మిర్చి, మొక్కజొన్న, వరి పంటలపై జివో 42 ద్వారా కేంద్రం తో సంబంధం లేకుండా నష్టపరిహారం సీఎం కేసీఆర్ విడుదల చేశాడన్నారు. ఒక్క నర్సంపేట నియోజక వర్గంలోనే 17,847 ఎకరాలలో 16,257 మంది రై తులకు రూ.8.50 కోట్ల నష్టపరిహారం అందించిన ఘనత దక్కిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన జివో ద్వారా మిర్చిపై ఎకరాకు రూ.5400, మొక్కజొన్నపై రూ.3340లు అందించాల్సి వచ్చిందని చెప్పారు. ఇటీవల తిరిగి పడిన వడగండ్ల వానకు భారీ స్థాయి లో మొక్కజొన్న, వరి, మిర్చి పంటలు దెబ్బతినడం వి చారకరమన్నారు. పంట నష్టం, రైతు బాధేంటో చె ప్పగా సీఎం కేసీఆర్ స్వయాన పర్యటించి రైతు కన్నీరును తూడ్చాడన్నారు. ప్రత్యేక ప్యాకేజి ప్రక టించి పంట ఏదైనా రూ.10 వేల నష్ట పరిహారం ప్ర కటించి మరోసారి కేసీఆర్ రైతు పక్షపాతిగా నిరూ పించుకున్నాడన్నారు. రైతుకు పెట్టుబడి తగ్గిండం కూలీలకు యేడాది మొత్తంగా పనిదినాలు కల్పించడా నికి ఏకైకమార్గంఉపాధిహామీ పథకాన్ని వ్యవసా యా నికి అనుసంధానం చేయాలని నాలుగేళ్ల క్రితం అ సెంబ్లీ తీర్మాణం చేసి పంపిస్తే కేంద్రం స్పందించక పోవడం శోచనీయమన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యానవన అధికారి శ్రీనివాసరావు, ఏడీఏ అవినాష్ వర్మ, ఎంపీపీ మోతె కలమ్మ, ఏవో కృష్ణ కుమార్, సర్పంచ్ మొలుగూరి చంద్రమౌళి, పీఏసీఎస్ చైర్మన్ మురాల మోహన్ రె డ్డి, ఏఈవో అశోక్, రైతు సమన్వయకర్త కడారి కుమా రస్వామి, బీఆర్ఎస్ నాయకులు మచ్చిక నర్సయ్య, నామాల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
నష్టపరిహార చెక్కులు పంపిణీ
నల్లబెల్లి : అకాల వడగళ్ల వర్షాలతో గత సంవత్సరం జనవరిలో కురిసిన వర్షానికి ఎంతో మంది రైతులు పంట, ఆస్తి నష్టపోయి దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న రైతులను ప్రత్యక్షంగా కలిసి ప్రతి రైతులకు భరోసా కల్పించి నేడు నష్టపోయిన రైతులకు (ఇన్పుట్ సబ్సిడీ) చెక్కులు పంపిణీ చేయడం సంతోషమని అన్నారు. ఇప్పటివరకు ఏ ప్రభుత్వం నాకు తెలిసి రైతులకు నష్టపరిహారం అందివ్వలేదని ఒక కేసీఆర్ ప్రభుత్వం రైతుల పక్షపాతి ప్రభుత్వం చొరవ తీసుకొని అందివ్వడం జరుగుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఊడుగుల సునీత, జెడ్పిటిసి పెద్ది స్వప్న, తహశీల్దార్ దూలం మంజుల, పిఎసిఎస్ చైర్మన్ మురళీధర్ రావు, డిహెచ్ఎస్ఓ శ్రీనివాసరావు, ఏడి, ఏవో పరమేశ్వర్, ఏఈఓ శ్రీకాంత్, మహేందర్, స్థానిక సర్పం చ్ నానబోయిన రాజారాం, ఎంపీటీసీ జన్ను జయరావు, బిఆర్ఎస్ మండల కన్వీ నర్ ఊడుగుల ప్రవీణ్ గౌడ్, ఆర్ఎస్ఎస్ కోఆర్డినేటర్ గోనెల పద్మ నరహరి, క్లస్టర్ ఇన్చార్జిలు గందె శ్రీనివాస్ గుప్తా, కక్కర్ల శ్రీనివాస్ గౌడ్, కొండెల్పల్లి సర్పంచ్ మో హన్‌రెడ్డి, రేలకుంట సర్పంచ్ రత్నాకర్ రెడ్డి, నందిగామ సర్పంచ్ సలేంద్ర నాగేశ్వరరావు, లేంశీంకపల్లి సర్పంచ్ లక్ష్మి సాంబయ్య, సుభాష్, మండల నాయ కులు, రైతులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.