Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విభజన హామీలు నెరవేర్చని కేంద్రాన్ని నిరుద్యోగులు నిలదీయాలి
- సీపీఐ ఉమ్మడి వరంగల్ జిల్లా సమావేశంలో చాడ వెంకట్ రెడ్డి
నవతెలంగాణ-హనుమకొండ
తెలంగాణ అభివృద్ధిపట్టని బీజేపీ నాయకులు ఈ నెల 15న హనుమ కొండ లో నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తామనడం హాస్యాస్పదంగా ఉందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి అన్నారు. గురువారం హనుమకొం డ బాల సముద్రంలో గల సీపీఐ జిల్లా కార్యాలయంలో ఉమ్మడి వరంగల్ జిల్లా పార్టీ కార్య దర్శులు,ముఖ్య నాయకుల సమావేశం సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు తక్కళ్ల పల్లి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఇటీవల 12 రోజుల పాటు విభజన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ చేపట్టిన ప్ర జాపోరు యాత్రలో పాల్గొన్న 200మంది నాయకులు,కార్యకర్తలకు ప్రశంసా ప త్రం, మెమొంటోలను చాడ వెంకట్ రెడ్డి ద్వారా అందజేశారు. ఈ కార్యక్రమంలో చాడ మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీపీఐ చేపట్టిన ప్రజాపోరు యాత్ర వల్లనే నేడుకేంద్రంలో, రాష్ట్రంలో విభజన హామీలపై చర్చ మొదలైందని అన్నారు. నేడుఅధికార, ప్రతిపక్ష పార్టీలు విభజన హామీలైన కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యా రం ఉక్కు పరిశ్రమ, ములుగులో గిరిజన యూనివర్సిటీ గురించి మాట్లాడే పరిస్థి తి ఏర్పడిందని, ఆ క్రెడిట్ ఉమ్మడి వరంగల్ జిల్లా సిపిఐ దేనని అన్నారు. విభజన హామీలు నెరవేరితే ఈ ప్రాంత యువకులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిం చేవని, తొమ్మిది ఏండ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ఏనాడూ వీటిపై స్పందించకుండా నిర్లక్ష్యం కనబరిచిందని అన్నారు.
ఏటా 2కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని నిరుద్యోగులకు ఆశ చూపిన నరేంద్ర మోడీ ఉన్న ఉద్యోగాలను తొలగించి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించి తన మిత్రులైన కార్పొరేట్ శక్తలకు కట్టబెట్టారని విమర్శించారు. విభజన హామీలు నెర వేర్చని బీజేపీ నాయకులు, ప్రజాప్రతినిధులు ఏం ముఖం పెట్టుకొని నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తారని ప్రశ్నించారు. తెలంగాణ యువత బిజెపి నాయకుల మాట లకు మోస పోవద్దని, కులాలు, మతాల పేరుతో మనుషుల మద్య విభేదాలు సృ ష్టిస్తూ, మనువాద రాజ్యాంగాన్ని అమలు చేయాలని చూస్తున్న బిజెపికి వ్యతిరేకం గా ప్రజలను చైతన్య పరచాలని కోరారు. ప్రజాపోరు యాత్ర ను నిర్వహించిన ఉ మ్మడి వరంగల్ జిల్లా సీపీఐ శ్రేణులు రానున్న రోజుల్లో ఇంటింటికి సిపిఐ కార్యక్ర మాన్ని కూడా చేపట్టి విజయవంతం చేయాలని కోరారు. రాష్ట్రంలోనే మొట్ట మొదటిగా వేలాది మందిని సమీకరించి భూ పోరాటాలు నిర్వహించిన ఘన చరి త్ర ఉమ్మడి వరంగల్ జిల్లా సిపిఐ కి దక్కుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి.విజయ సారథి, నేదు నూరి జ్యోతి, జిల్లాల కార్యదర్శులు మేకల రవి, కర్రె బిక్షపతి, సిహెచ్ రాజారెడ్డి, కొరిమి రాజ్‌కుమార్, తోట మల్లికార్జున రావు,జన సేవాదల్ రాష్ట్ర కన్వీనర్ పంజా ల రమేష్, జిల్లా సహాయ కార్యదర్శులు తోట బిక్షపతి, మద్దెల ఎల్లేష్, రాష్ట్ర సమితి సభ్యులు ఆదరి శ్రీనివాస్, మండ సదాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.