Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాడు ఎడారి భూములు నేడు సిరుల మగానులు
- ప్రతిగింజను కొనుగోలు చేస్తాం...
- సర్వ మతాలకు కేసీఆర్ సమాన అవకాశాలు
- రంజాన్ మాసం త్యాగానికి ప్రతిరూపం
- పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
నవతెలంగాణ-రాయపర్తి
తెలంగాణ రాష్ట్రంలో రైతన్నలకు ముఖ్యమంత్రి కేసీఆర్ సర్కారు వెన్నుదన్నుగా నిలుస్తుందని పం చాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. గురువారం మండలకేంద్రంలో రైతు వేదిక వద్ద పీఏసీఎస్ ఆధ్వర్యంలోఏర్పాటు చేసిన యాసంగి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయగా మంత్రి ముఖ్య అతిథిగా విచ్చేసి మంత్రి ప్రారంభిం చారు. తదుపరి ముస్లిం సోదరులు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. రంజాన్ పర్వదినాన్ని పు రస్కరించుకుని ప్రభుత్వం పంపిణీ చేసిన దుస్తులను ముస్లిం సోదరులకు అందచేశారు. అనంతరం మం త్రి మాట్లాడుతూ వ్యవసాయరంగం అభివృద్ధి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవసాయ సాగునీటి కోసం 24 గంటలపాటు ఉచిత కరెంటు పెట్టుబడి సాయం కిం ద రైతుబంధు పథకం ద్వారా రెండు పంటలకు గాను ఎకరాకు రూ.10వేలు అందించే కార్యక్రమం రైతు బీమా పథకం ద్వారా వ్యవసాయ రైతులు మరణిస్తే రూ.5 లక్షల రూపాయల బీమా పథకం రైతులు పం డించే ప్రతి పంటకు మద్ద తుధర కల్పిస్తూ కొనుగోలు కేంద్రాల ద్వారా పంటల ను కొనుగోలు చేసి రైతులకు కొండంత అండగా నికి స్తుంది అని పేర్కొన్నారు. గతంలో సాగునీరు లేక రై తులు ఇబ్బందులకు గురయ్యారు కానీ తెలంగాణ రా ష్ట్రం ఏర్పడిన తర్వాత బీడువారిన భూముల్లో సిరులు పండుతున్నాయని అన్నారు. ప్రతి వరి ధాన్యం గిజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది అన్నారు. ధాన్యం కొ నుగోలు కేంద్రాలను వచ్చే రైతులకు తాగునీరు, నిలు వనీడ, టార్పాలిన్స్వంటి సౌకర్యాలు కల్పించాల ని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీవత్స కోట, డిసిఓ సంజీవ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ కుందూరు రామచంద్రారెడ్డి, ఎంపీపీ జినుగు అనిమి రెడ్డి, జెడ్పీటీసీ రంగు కుమార్, తహశీల్దార్ సత్యనారా యణ, సర్పంచ్ గారె నర్సయ్య, ఎంపీటీసీ రాంచం దర్, నాయకులు బందెలా బాలరాజు, సుధాకర్, రా ము, సింహాద్రి తదితరులు పాల్గొన్నారు.
రంజాన్ మాసం త్యాగానికి ప్రతిరూపం
రంజాన్ మాసం త్యాగానికి ప్రతిరూపం అని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. రంజాన్ మాసం పర్వదినా న్ని పురస్కరించుకొని ముస్లిం సోదరులకు నూతన వ స్త్రాలు అందజేయడం సంతోషకరమన్నారు. సర్వ మ తాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి సమాన అవకాశాలు కల్పి స్తున్నారని తెలిపారు. రానున్న రోజుల్లో ముస్లిం సోద రులకు ప్రభుత్వం ఆర్థికపరమైన అభివద్ధిని అందించ డానికి సిద్ధంగా ఉందన్నారు. రాయపర్తి మండల వ్యా ప్తంగా ముస్లిం సోదరులు పెద్ద కొన్ని సంవత్సరా లుగా తనకు అండగా నిలవడం సంతోషకరమ న్నారు. మండలంలో మసీదులను అభివద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.
రాయపర్తి మండల కేంద్రంలో కబరిస్తాన్ ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మసీదు కమిటీ అధ్యక్షుడు ఎండి నాయిమ్, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు నరసింహ నాయక్, జిల్లా నాయకుడు బిల్లా సుధీర్ రెడ్డి, రైతు బంధు మండల కోఆర్డినేటర్ సురేందర్ రావు, సదర్ సాహెబ్ లాయక్, భాషా మియా, అక్బర్, ఉస్మాన్, అన్వర్, అస్గర్, లతీఫ్, తదితరులు పాల్గొన్నారు.