Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఎన్జీవోస్ కాలనీ
భారతదేశం గర్వపడేలా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అంబేద్కర్ జయంతిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల కాంస్య విగ్రహ ప్రతిష్టించారని, ప్రభుత్వ చీఫ్‌విప్ వినయ్‌భాస్కర్ అన్నారు. శుక్రవారం హనుమకొండలోని అంబేద్కర్ భవన్లో అంబేద్కర్ 132వ జయంతి మహౌత్సవాల్లో వినయ్ భాస్కర్ పాల్గొని జ్యోతి ప్రజ్వల చేసి మాట్లాడారు. దేశంలోనే ఎత్తైన అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని హైదరాబాద్‌లో ప్రతిష్టించి త్వరలో ప్రారంభించ బోయే తెలంగాణ సెక్రటేరియట్‌కి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టారని అన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం లోని ఆర్టికల్ 3 ప్రకారం గాంధేయ మార్గంలో శాంతిమార్గంలో కులాలకు మతాలకతీతంగా అతీతంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారన్నారు. దళితులందరూ ఆత్మగౌరవంతో ఆర్థికంగా నిలదుక్కోవడానికి దళితబంధు కింద ప్రతి కుటుంబానికి పది లక్షల రూపాయలు ఇస్తున్నారని అన్నారు. అంబేద్కర్ ఓవర్సీస్ పథకం ద్వారా పేద విద్యార్థులకు విదేశాలకు వెళ్లి చదువుకునే అవకాశం కల్పిస్తున్నారని అన్నారు. పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన అందరికీ అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందిస్తున్నారని అన్నారు. అంబేద్కర్ అంటే కేవలం దళితులకే కాదని అన్ని వర్గాల ప్రజల హక్కుల గురించి పోరాడారని అన్నారు. సమాజంలో అన్ని వర్గాల ప్రజల కోసం ఆలోచించారని అందరివాడు అని అన్నారు కొన్ని దుష్ట శక్తులు, కొన్ని పార్టీల నాయకులు కులాల మతాల మధ్య చిచ్చుపెట్టి ప్రజల ఆశయ సాధనకు అభ్యున్నతికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని అన్నారు. ఇలాంటి వారికి ప్రజలు గుణపాఠం చెప్పాలని అన్నారు. అంబేద్కర్ జీవితాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని అన్నారు. అంబేద్కర్ కలలుగన్న సమ సమాజానిక కనుగుణంగా కేసీఆర్ పాలన సాగస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి సిక్తా పట్నాయక్, వరంగల్ నగర సీపీ ఏవీ రంగనాథ్, జెడ్పీ చైర్మన్ డాక్టర్ సుధీర్ కుమార్, అడిషనల్ కలెక్టర్ సంధ్యా రాణి, కుడా చైర్మన్ సంగం రెడ్డి సుందర్‌రాజ్‌యాదవ్ ఇతర అధికారులు, నాయకులు కుల సంఘ నాయకులు ప్రజా సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.