Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సింగరేణి ఏరియా జీఎం శ్రీనివాసరావు
నవతెలంగాణ-కోల్బెల్ట్
ప్రపంచ దేశాలు అనుసరిస్తున్న రాజ్యాంగాలలో కెల్లా భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం విభిన్నమైనదని సింగరేణి భూపాలపల్లి ఏరియా జనరల్ మేనేజర్ బళ్లారి శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 132వ జయంతిని సింగరేణి ఆధ్వ ర్యంలో జయశంకర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ క్రీడా మైదానంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్య క్రమానికి ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసి యేషన్ నాయకులు ఎం.వి. రావు అధ్యక్షత వహించగా ఏరియా జనరల్ మేనేజర్ బళ్లారి శ్రీనివా సరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంబేద్కర్ విగ్రహానికి గజమాలను సమర్పించి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భీమ్ రావు అంబేద్కర్ మారుమూల ప్రాంతంలో పేదిం టిలో జన్మించి తన జీవిత ఆశయ సాధనలో ఎంతో వివక్షకు గురై, ఆటుపోటులను ఎదుర్కొని ఆంగ్లేయుల పాలనలో ఉన్నత విద్యను అభ్యసించి భావి తరాల భవిష్యత్తుకు రాజ్యాంగాన్ని రచించి ప్రపంచ దేశాలకే ఆదర్శప్రాయంగా నిలిచారని తెలిపారు. దాని ఫలితమే నేడు మనం అనుభ విస్తున్న స్వేచ్ఛ, స్వాతంత్య్రం, హక్కులు అని కొనియా డారు. దేశంలోని వివిధ మతాలు, వర్గాలు, కుల వ్య వస్థలు చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా దేశ ప్రజలందరూ ఐక్యతతో ఉండి దేశానికి, రాష్ట్రానికి, సింగరేణి సంస్థకు ఆదర్శంగా ఉండాలన్నారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఆయా గనులలో, సింగరేణి పాఠశాలలో నిర్వహించిన క్విజ్ పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులను అందించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓటు జీఎం బి వెంకటయ్య, ఏజీఎంలు రామలింగం, ఎస్ జోతి, డీజీఎం కె సత్యనారాయణ, డీజీఎం(పర్సనల్) అజ్మీర తుకారం, పర్సనల్ మేనేజర్ బి శివ కేశవ, సీనియర్ పీఓ శ్యాంప్రసాద్, ఆయా గనుల సంక్షేమ అధికా రులు ఆర్ చంద్రశేఖర్ లైసెన్ ఆఫీసర్, రమేష్ ఎస్టి లైసెన్ ఆఫీసర్, కష్ణస్వామి, ఎస్సీ అసోసియేషన్, గొల్ల రమేష్, ఎస్టి అసోసియేషన్, టీబీజీకేఎస్ యూ నియన్ నాయకులు ఏబూసి ఆగయ్య, ఏఐటీయూసీ నాయకులు చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.