Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ములుగు
ములుగు జిల్లా పోలీస్ అర్మడ్ రిజర్వ్ విభాగంలో విధులు నిర్వహిస్తూ అనుకోనివిధంగా ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో మరణించిన హెడ్ కానిస్టేబుల్ ప్రసాద్ కుటుంబ సభ్యులను జిల్లా ఎస్పీ గౌస్ ఆలం, ఓఎస్డి అశోక్ కుమార్ శుక్రవారం వెంకటాపూర్ మండల కేంద్రంలోని స్వగృహంలో ప్రసాద్ పార్థివ దేహానికి పూల మాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం వారి కు టుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ బాధిత కుటుంబ సభ్యులం దరూ ధైర్యంగా ఉండాలని, ములుగు జిల్లా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా నిలబడుతుందని అన్నారు. ప్రభుత్వం ద్వారా రావాల్సిన అన్ని లాభాలు మంజూరు అయ్యేలా చూస్తానని అన్నారు. ఉద్యోగ అర్హత కలిగిన కుటుంబ సభ్యులలో ఒకరికి ఉద్యోగం లభించేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ సదానందం, ఆర్ఐ అడ్మిన్ వెంకటనారాయణ, ఆర్ఐ హౌంగార్డ్ స్వామి, వెంకటాపూర్ ఎస్సై తాజుద్దీన్, తదితరులు పాల్గొన్నారు.