Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంజీఎన్ ర్ఈజీఎస్ జాక్ ములుగు జిల్లా
- ముఖ్య సలహాదారులు ఎల్పీ రామ్
నవతెలంగాణ -తాడ్వాయి
ఉద్యోగులకు పే స్కేల్ వర్తింపజేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎంజిఎన్ఆర్ఇజి ఎస్ జాక్ ములుగు జిల్లా ముఖ్య సలహాదారుడు ఎల్ రాము డిమాండ్ చేశారు. శుక్రవారం మండల కేం ద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో వారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 382 మంది శిక్షణ పొందిన అభ్యర్థులు ఉద్యోగులుగా విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. గ్రామీణాభివృద్ధి శాఖలో 17 ఏళ్లుగా కాంట్రా క్టు పద్ధతి పై ఎఫ్‌ఏలు, టిఏలు, ఈసీలు, ఏపీవోలు కంప్యూటర్ ఆపరేటర్లు, బీఎఫ్టీలుగా పనిచేస్తున్నారని అన్నారు. ఒకే గూడు కింద ఐకెపి ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్నామని, ఐకెపి సిబ్బందికి పే స్కేలు వర్తింప చేస్తూ జీవో ఎలా జారీ చేశారో తమకు కూడా అలాగే పే స్కేల్ వర్తింప చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టిఏలు శిరీష, సురేష్, బిఎఫ్టి రాజ్‌కుమార్, సిఓలు శ్రీకాంత్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.