Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బాలల సంక్షేమ సమితి సభ్యులు
నవతెలంగాణ - కాటారం
ఇటీవల తల్లిదండ్రులను కోల్పోయి అనాధలుగా మారిన ముగ్గురు బాలలను అన్ని విధాలుగా ఆదుకుంటామని బాలల సంక్షేమ సమితి సభ్యులు డాక్టర్ పరికి సుధాకర్, సందసాని రాజేంద్ర ప్రసాద్ లు హామీ ఇచ్చారు. మార్చి నెల 29 న ఓ పత్రికలో మద్దులపల్లి గ్రామంలోని అనాధ పిల్లల పరిస్థితి పై కథనం ప్రచురితమైన నేపథ్యంలో శుక్రవారం బాలల సంక్షేమ సమితి సభ్యులు బాలల ఇంటికి చేరుకొని వివరాలు ఆరా తీశారు. కుటుంబ పరిస్థితుల వల్ల చదువు మధ్యలోనే ఆపేసిన బాలలను పాఠశాలలో చేర్పించి జిల్లా బాలల పరి రక్షణ విభాగం వారు అందించే స్పాన్సర్ షిప్ పథకం ద్వారా ఆర్థిక సహాయాన్ని అందించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. అనంతరం మండల కేంద్రం లోని తిమోతి బాలుర ఆశ్రమంలో డాక్టర్ బీఆర్ అంబెడ్కర్ జయంతి సంద ర్భంగా అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. బాల లు మెరుగైన విద్యను అభ్యసించి అంబ్కేర్ ఆశయాలను సాధించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇంచార్జి బాలల పరిరక్షణ అధికారి వెంకటస్వామి, బాలల సంరక్షణ అధికారి రాజకొమురయ్య, సోషల్ వర్కర్ శైలజ, ఔట్ రీచ్ వర్కర్ సోషల్ కుమార్, అంగన్వాడీ టీచర్ తదితరులు పాల్గొన్నారు.