Authorization
Thu February 20, 2025 03:08:19 pm
- అగ్గి రాజేయడం తో కాలి కూలిన వైనం
- విద్యుత్ తీగలు, స్తంభాలు ధ్వంసం
- నిలిచిన విద్యుత్ సరఫరా
నవతెలంగాణ-గణపురం
గణపురం మండలం లక్ష్మారెడ్డి పల్లి వద్ద జాతీయ రహదారి పక్కన గల సుమారు 100ఏళ్ల పైన చరిత్ర కలిగిన వట వృక్షం ఆకతాయిల నిర్లక్షపు చేష్టలకు నెలకొరిగింది. గత రాత్రి గుర్తుతెలియని కొందరు వ్యక్తులు వక్షానికి అగ్గి రాజేయడం తో తీవ్ర మంటలు అలుముకున్నాయి. స్థానికులు గమనించి మంటలు ఆర్పే ప్రయత్నం చెంసిన లాభం లేకుండా పోయింది. మంటలు అదుపులోకి రాకపోవడంతో వక్షం లోలోపల దగ్ధం కావడంతో విరిగి నెల కూలింది. వృక్షం విరిగి పడటంతో అక్కడే ఆనుకొని ఉన్న 33కెవి విద్యుత్ తీగల తెగిపోయి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అగ్నిమాపక యంత్రం స హాయంతో మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. వి ద్యుత్ శాఖ సిబ్బంది తెగిపోయిన విద్యుత్ తీగలు మ రమ్మతులు చేపట్టారు. ఏళ్ళ చరిత్ర కలిగిన మహా వృక్షం నేలకూలడంతో స్థానిక ప్రజానీకం కలవర చెందుతున్నారు. వృక్షంతో తమకున్న అనుభూతులు గుర్తు చేసుకొని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.