Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాలుగు ట్రాక్టర్లు సీజ్, రేంజ్‌కు తరలింపు
నవతెలంగాణ-మల్హర్రావు
కొయ్యుర్ ఫారస్ట్ రేంజ్ అధికారి కిరణ్ కుమార్ ఆదేశాల మేరకు తాడిచెర్ల సెక్షన్ అధికారి శ్రీనివాస రెడ్డి ఆధ్వర్యంలో అక్రమ ఇసుక రవాణాపై పారెస్ట్ అ ధికారులు శుక్రవారం అర్ధరాత్రి మెరుపు దాడులు నిర్వహించారు.మండల కేంద్రమైన తాడిచెర్ల బిట్ పరిధిలోని దేశాభందం మానేరు పరివాహక ప్రాం తంలో నుంచి రాత్రి వేళల్లో అక్రమంగా ట్రాక్టర్ల ద్వారా భూపాలపల్లి మండలం నెరేడుపల్లి,కొంపల్లి గ్రామాలకు అక్రమ ఇసుక వ్యాపారులు ఇసుక దందా ను యథేచ్ఛగా సాగిస్తున్నారనే సమాచారం మేరకు అటవీశాఖ అధికారులు మాటువేసి నాలుగు ఇసుక ట్రాక్టర్లను పట్టుకొని సీజ్ చేసి కొయ్యుర్ ఫారెస్ట్ కార్యాలయానికి తరలించినట్లు సెక్షన్ అధికారి శ్రీని వాసరెడ్డి తెలిపారు. గత నాలుగేళ్లలో ఇప్పటికి 250 ఇసుక ట్రాక్టర్లు పట్టుకున్నట్లుగా తెలిపారు.అక్రమ ఇసుక దందాకు ముకుతాడు వేసేందుకు తమవం తుగా ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమం లో బీట్ అధికారులు మహేందర్, విష్ణువర్ధన్, అంజలి, శ్రీకాంత్, బి ఎస్కబ్ సిబ్బంది పాల్గొన్నారు.