Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వాలీబాల్ జాతర క్రీడలు ప్రారంభం
నవతెలంగాణ -తాడ్వాయి
మండలం లోని బేరంబోయిన వంశం 6 వ గొట్టు మూలం శ్రీ కారుకొండ సడలమ్మ జాతర ఘనంగా నిర్వహిస్తున్నామని, తుడుందెబ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మైపతి అరుణ్ కుమార్, జాతర నిర్వహణ కమిటీ అధ్యక్షులు గంగారం మాజీ సర్పంచ్ బడే రాంబాబు తెలిపారు. బుధవారం దోన గుట్ట నుండి వచ్చిన అమ్మవారు భుపతిపుర్ గద్దెకు చేరి గురువారం అన్నారం గద్దెల పైకి వచ్చిందని అన్నారు. కారుకొండ సడలమ్మ మూలానికి చెందిన యెట్టి, మైపతి,అన్నారం, కుడుముల, దనూరి, ఆత్రం వంశస్తులు, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుండి వచ్చి మొక్కులు చెల్లించుకుంటుంన్నారని తెలిపారు. నేడు శనివారం మళ్ళీ దేవర వన ప్రవేశం చేయనున్నట్లు తెలిపారు. పూర్వం అన్నారం కేంద్రంగా కోయ రాజ్యం నడిచిన గడి కోట బావులు పురావస్తు ఆధారాలు నేటికీ సజీ వంగా ఉన్నాయన్నారు. ఈ జాతర అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. రెండు రోజులుగా జరుగుతున్న వాలీబాల్ క్రీడలలో 80 టీమ్ లు పాల్గొన్నాయని క్రీడల నిర్వహణ కమిటీ అధ్యక్షుడు తాటి నవీన్, కోచ్ కొర్నిబేల్లి గణేష్ తెలిపారు. క్రీడలను జాతర నిర్వహణ కమిటీ అధ్యక్షులు ఇనాగ్రేషన్ చేయగా ఐటీడీఏ పెసా కొర్డినేటర్ కొమరం ప్రభాకర్, టీడబ్ల్యూటీయూ రాష్ట్ర అధ్యక్షు లు పోదెం కష్ణ ప్రసాద్, సామాజిక న్యాయవేదిక ములుగు జిల్లా మహిళా అధ్యక్షురాలు మడే పూర్ణిమ, తుడుందెబ జిల్లా ఉపాధ్యక్షులు యెట్టి ప్రకాష్, మండల అధ్యక్షులు గౌరబోయిన మోహన్రావు, జీసీసీ ఏటూరు నాగారం చైర్మన్ పులుసం పురుషోత్తం, తదితరులు పరిచయం చేసుకున్నారు.