Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యువైఏప్ఐ రాష్ట్ర అధ్యక్షులు. అక్కల బాపు యాదవ్
నవతెలంగాణ-మల్హర్రావు
ప్రగతి శీల విద్యార్థి నాయకుడు కామ్రేడ్ జార్జి రెడ్డి ఆశయాలను కొనసాగిం చాలని యువైఏప్ఐ రాష్ట్ర అధ్యక్షుడు అక్కల బాపు యాదవ్, తెలంగాణ మాలబెరీ రాష్ట్ర కన్వీనర్ పీక కిరణ్ కోరారు. జార్జిరెడ్డి 51వ వర్ధంతి సందర్భం గా శుక్రవారం మండలంలోని కొయ్యుర్ గ్రామంలో ఆయన చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు ప్రగతి నిరోధక శక్తులు జార్జి రెడ్డిని 51 సంవత్సరాల క్రితం ఉస్మానియ యూనివర్సిటీ లో దారుణంగా చంపారని అన్నారు. విద్యార్థుల సమస్యలపై నిరంతరం ఉద్య మాలు నడిపిన నాయకుడు జార్జి రెడ్డి అన్నారు. జార్జిరెడ్డి నిర్వహిస్తున్న పోరా టాలను చూసి ఓర్వలేని తనంతో ఏబీవీపీ గుండాలు జార్జిరెడ్డి దారుణంగా చంపడం దుర్మార్గమైన చర్యన్నారు. విద్యార్థుల్లో విప్లవ కరమైన చైతన్యం తీసుకు రావడంలో జార్జి రెడ్డి చేసిన కృషి మరువలేనిదని కొనియాడారు. భగత్ సింగ్ , చేగువేరా లాంటి నాయకుల పోరాట స్ఫూర్తిని తీసుకుని విద్యార్థి ఉద్యమాలు నిర్వహిస్తుంటే సంఘ వ్యతిరేక శక్తుల సహాయంతో ఏబీవీ పీ దుర్మార్గమైన చర్య చేసిందన్నారు. దీంతో ప్రగతిశీల విద్యార్థి ఉద్యమం ఆగిపోతుందని అనుకున్నారని, కానీ, అనేక విద్యార్థి, యువజనసంఘాలు జార్జిరెడ్డి స్ఫూర్తితో పోరాట నిర్మాణాలు జరిగాయన్నారు. ఈ కార్యక్రమంలో నేషనల్ హుమన్ రైట్స్ మండల కమిటీ అధ్యక్షుడు చింతల కుమార్ యాదవ్, ఉపాధ్యక్షుడు బండి సుధాకర్, జిల్లా ఉపాధ్యక్షుడు ముడుతనపల్లి ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి జంబోజు రవిందర్, ప్రజా సంఘాల నాయకులు నరేల ఓదెలు, రాజనర్సు, ఎడ్ల రాములు పాల్గొన్నారు.