Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నర్సంపేట
డాక్టర్ బీఆర్.అంబేద్కర్ జీవితం నేటి సమాజానికి స్ఫూర్తిదాయకమని ఎమ్మె ల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలో బీఆర్.అంబేద్కర్ 132వ జయంతి వేడుకల్లో హాజరైయ్యారు. ఆయన విగ్రహానికి ఎమ్మెల్యేతో పాటు పలు సంఘాల నాయకులు, బీఆర్ఎస్ నాయకులు పూలమాల వేసి నివాళులర్పిం చా రు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా మాట్లాడారు. అంబేద్కర్ దేశం గ ర్వించదగిన మహోన్నత వ్యక్తి అన్నారు. భారత రాజ్యాంగం రచించడమే కాదు ఈ దేశంలో అట్టడుగు వర్గాల అభ్యున్నతికై పోరాడి మేల్పోలారని కొనియాడారు. తె లంగాణ ప్రభుత్వం అంబేద్కర్ అందించిన స్ఫూర్తితో దళిత బంధు పథకం ప్రవేశ పెట్టిందన్నారు. సీఎం కేసీఆర్ దేశంలో ఏరాష్ట్రం ఇవ్వని గౌరవాన్ని ఇచ్చారని తెలి పారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించి అత్యంత సమున్నత స్థాయిలో గౌరవించారని తెలిపారు.నర్సంపేటలో అంబేద్కర్ సెంటర్లో రూ.10 లక్షలతో కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవో సీ.శ్రీనివాసులు, తహశీల్దార్ వీ.రాంమూర్తి, ము న్సిపల్ చైర్పర్సన్ గుంటి రజినీకిషన్, మాజీ సర్పంచ్ నల్లా మనోహర్‌రెడ్డి, బీ ఆర్ఎస్ పట్టణాధ్యక్షులు నాగెల్లి వెంకటనారాయణగౌడ్, లెక్కల విద్యాసాగర్ రెడ్డి వివిధ వార్డు కౌన్సిలర్లు, దళిత సంఘాల జేఏసీ కన్వీనర్ గద్దల వెంకటేశ్వర్లు, ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంటెండ్ పీ.గోపాల్, దళిత సంఘాల జేఏసీ కో-కన్వీనర్ కల్లెపెల్లి ప్రణయదీప్ మాదిగ, గుంటి వీరప్రకాష్, గునికంటి ఈశ్వర్, ఎ స్సీ సెల్ పట్టణాధ్యక్షులు కొమ్ముక కర్ణాకర్, ఎంఆర్పీఎస్ టీఎస్ నాయకులు మైసి శోభన్, ఎంఆర్పీఎస్ నాయకులు రాజశేఖర్, ఆరెపెల్లి బాబు,మారపెల్లి అశోక్, కొ మ్ముల నవీన్, పూలే అంబేద్కర్ సంఘం నాయకులు పడిశాల స్వామి, స్వేరోస్ చింతల సదానందం, గాదె ఇసాక్, మహిళ సంఘం నాయకురాలు గొర్రె రాధ, వే ల్పులు సునీత, నూనె స్వరూప, గుంటి ప్రమీల, దళిత ప్రజా సంఘాల కో-కన్వీన ర్లు, సలహాదారులు కోటడేవిడ్, బోయిని నారాయణ, శ్రీకాంత్, బానాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
డాక్టర్ బీఆర్.అంబేద్కర్ ఆశయ సాధనకై ఉద్యమించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కొరబోయిన కుమారస్వామి అన్నారు. శుక్రవారం అంబేద్క ర్ 132వ జయంతి వేడుకలను నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళ్లర్పించి మాట్లాడారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం అంబేద్కర్ అందించిన రాజ్యాంగాన్ని రద్దు చేసి మనుస్మృతిని ప్రవేశపెట్టాలని కుట్రలు చేస్తుందన్నారు. రాజ్యాంగ రక్షణకై యువతరం ఏకమై తిప్పికొట్టాలన్నారు.ఈ కార్యక్రమంలో సీపీ ఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు హన్మకొండ శ్రీధర్, గుజ్జుల ఉమా, పట్టణ కమిటీ సభ్యులు గడ్డమీద బాలకృష్ణ, కందికొండ రాజు, గుజ్జుల వెంకన్న, ఇప్ప సతీష్, నా యకులు సింగారపు బాబు, వజ్జంతి విజయ, బిట్ర స్పప్న, తాళ్లపెల్లి ప్రవళిక, ఉద యగిరి నాగమణి తదితరులు పాల్గొన్నారు.
భారత రాజ్యాంగాన్ని అందించిన డాక్టర్ బీఆర్.అంబేద్కర్ సామాజిక విప్లకా రుడని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి భూక్య సమ్మయ్య అన్నారు. శుక్రవారం అంబేద్కర్ 132వ జయంతి వేడుకల్లో అయన విగ్రహానికి పూలమాల వేసి నివాళ్లర్పించారు. ఈ సందర్భంగా సమ్మయ్య మాట్లాడుతూ దేశంలోని కుల, మత సామాజిక సమస్యలను పూర్తిగా అధ్యయనం చేసి రాజ్యాంగం ద్వారా పేద ప్రజానికానికి హక్కులు కల్పించారన్నారు.అగ్రకుల ఆధిపత్యాన్ని నాడే ఎదురించి నిమ్న జాతుల విముక్తికై ఉద్యమించారని కొనియాడారు. నేడు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అంబేద్కర్ అందించిన రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేస్తూ పేద ప్రజలకు తీ రని అన్యాయం చేస్తుందని విమర్శించారు. పోరాడి సాధించుకున్న రైతు, కార్మిక చట్టాలను రద్దు చేస్తూ కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతుందన్నారు. ప్రభుత్వ రం గాలను అప్పనంగా అమ్మకం చేసి దేశ సంపదను కొల్లగొడుతుందని దుయ్య పట్టారు. ఇలాంటి తరణంలో పేద ప్రజానీకం ఏకమై మతోన్మాద బీజేపీ ప్రభుత్వా నికి తగిన బుద్ది చెప్పినప్పుడే అంబేద్కర్‌కు నిజమైన నివాళి అన్నారు.ఈ కార్యక్ర మంలో వ్యకాస జిల్లా నాయకులు భాస్కర్, మొగిళి, ఎస్కే.అన్వర్, సారయ్య, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
దుగ్గొండి : బడుగు బలహీన, దళిత వర్గాల అభ్యున్నతి ఆకాంక్షించిన బహు జనుల బాంధవుడు భారత రాజ్యాంగనిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ అని ఎంసీ పీఐ రాష్ట్ర కమిటీ సభ్యులు కుసుంబ బాబూరావు అన్నారు. మండలంలోని తి మ్మంపేట గ్రామంలోని అంబేద్కర్ విగ్రహంవద్ద ఎంసీపీఐ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ 132వ జయంతి కార్యక్రమంలో పాల్గొని అంబేద్కర్ కు పూలమాలలు వేసిన అనంతరం ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకు లు నాగేల్లి కొమురయ్య,జిల్లా కమిటీ సభ్యులు ఎల్లబోయిన రాజు, డివిజన్ కమిటీ సభ్యులు తడుక కౌసల్య, నాగెల్లి భాస్కర్, గటికే మొగిలి తదితరులు పాల్గొన్నారు.
చెన్నారావుపేట : నీకోసం జీవిస్తే నీలోనే జీవిస్తావు జనం కోసం జీవిస్తే జ నంలో నిలిచిపోతావు అనిరాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 132 వ జన్మదిన వేడుకలను ఎమ్మార్పీఎస్, డి.ఎస్.పి మండల నాయకులు ఆధ్వర్యం లో మండల పరిధిలో చెన్నారావుపేట, పాపయ్యపేట గ్రామాలలో శుక్రవారం జ న్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల ఎమ్మార్పీ ఎస్ కన్వీనర్ మేకల సదయ్య, బీఎస్పీ మండల అధ్యక్షుడు అల్వాల శ్రీనివాస్, స ర్పంచ్ కుండే మల్లయ్య , జెడ్పి కోఆప్షన్ సభ్యుడు ఎండి రఫీ, మాజీ జెడ్పీటీసీ జు న్నుతుల రాంరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు భూక్య గోపాల్‌నాయక్, మం డల యువ నాయకుడు కృష్ణ చైతన్య రెడ్డి, వనపర్తి మల్లయ్యలు రాజ్యాంగ నిర్మాత చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు కందకట్ల సాంబయ్య, కాంగ్రె స్ గ్రామ అధ్యక్షుడు తాళ్లపల్లి నర్సయ్య, వార్డ్ మెంబర్ రసమల్ల సతీష్, జున్ను తు ల మహేందర్‌రెడ్డి, డీఎస్పీ డివిజన్ నాయకులు దబ్బేట శ్రీనివాస్, దప్పు కళా బృందం కళాకారులు నాయకులు పాల్గొన్నారు.
భారత రాజ్యంగా నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్క ర్ ప్రపంచ మేధావి, గొప్ప సంఘసంస్కర్త అని లింగాపురం సర్పంచ్ మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తప్పేట రమేష్ అన్నారు.బాబా సాహెబ్ అంబ ేద్కర్ 132 వ జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి ఘణంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా సర్పంచ్ తప్పేట రమేష్ మా ట్లాడుతూ అంబేద్కర్ భారత స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారనీ మరియు భార త రాజ్యంగం రచించి ప్రపంచ దేశాలు గర్వపడేలా చేశారని అంబేద్కర్ ప్రముఖ న్యాయవాదిగా,ఆర్థికవేత్తగా, సంఘ సంస్కర్తగా పనిచేసి ప్రపంచానికి జ్ఞానాన్ని అందించి అంటరానితనం రూపుమాపడానికి కృషి చేశాడని భారత రాజ్యంగ పరి షత్ సభ్యునిగా మొట్ట మొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రిగా పని చేసి దేశానికి ఎ న్నోగొప్ప సేవలందించారన్నారు.
అంబేద్కర్ దేశానికి చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం అంబేద్కర్ మరణానంతరం 'భారతరత్న' అవార్డును అందించిందని అ న్నారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి తు మ్మలపెల్లి సందీప్,ముదిగొండ చంద్రమౌళి,మైదం అనిల్, నమిండ్ల నర్సయ్య, బొక్కల అనిల్, తప్పేట వెంకటేశ్వర్లు,మండల యువ నాయకులు తప్పేట అఖిల్, తప్పేట కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.
నెక్కొండ : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 132వ జన్మదిన సందర్భంగా సిపిఎం సిఐటియు ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దే శించి సీఐటీ రాష్ట్ర కార్యదర్శి చాగంటి వెంకటయ్య మాట్లాడుతూ అంబేద్కర్ దేశం ప్రపంచ మేధావి ఉన్నత విద్యను అభ్యసించి అనేక కార్మిక చట్టాలు రూపొందించా రన్నారు. నేడున్న పాలకులు కార్పొరేట్లకు అనుకూలంగా మారుస్తున్నారని దుయ్య బట్టారు. దేశంలో మతోన్మాదం పెంచుతూ దళితులు మైనార్టీలపై దాడులు నిర్వ హిస్తున్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఆధారంగా కార్మిక చట్టాలను పక డ్బందీగా అమలుపరచుకుని ముందుకు సాగాలన్నారు. సీపీఎం మండల కార్యద ర్శి ఈదునూరి వెంకన్న మాట్లాడుతూ దేశంలో రాష్ట్రంలో ఇంకా వివక్షుల కొనసా గుతున్నాయని అంబేద్కర్ రచించిన రాజ్యాంగం పకడ్బందీగా అమలు జరిగితే స మాజ స్థాపన సామాజిక న్యాయం జరుగుతుందని అన్నారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దళితులపై కపట ప్రేమను ప్రదర్శిస్తూ ఓట్లు దండుకోవడం సర్వసాధారణమైపోయింది అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం సిఐటియు నాయకులు రాఘవ సాయిలు మదర్ దళిత కవి మందుల పరమాత్మ టిఎంఆర్పిఎస్ వడ్డూరి కుమార్ వీరస్వామి వన ప్రేమికుడు నల్లగొండ సమ్మయ్య మైనార్టీ నాయకులు ఎస్కె.లాలు క్రాంతి నగేష్ సైసు. పున్నం పాల్గొన్నారు.
అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించిన చిన్న పిల్లలు
మండల కేంద్రంలో తల్లిదండ్రుల ప్రమేయం లేకుండా తాము పోగేసుకున్న రూపాయి రూపాయి కలిపి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబే డ్కర్ 132వ జయంతిని ఘనంగా నిర్వహించారు. నేటి బాలలు రేపటి భావి భా రత పౌరులు అని మండల ప్రజలు అభినందించారు.ఈ కార్యక్రమంలో గోపగాని సంజరు, రిక్కీ , తేజస్,భువన, రశ్మిత, సహస్త్ర, నిస్సి, శ్రీఅన్షిత, సిరి పాల్గొన్నారు.
సీపీఐ ఆధ్వర్యంలో...
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి భారత రాజ్యాంగ నిర్మాత ఆర్థిక వేత జ్ఞాన సంపన్నులు సామాజిక వర్గాల అభ్యున్నతి కోసం సమసమాజ నిర్మాణం కో సం అహర్నిశలు శ్రమించిన భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 132వ, జయం తిని నెక్కొండ మండల కేంద్రంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ర్యాలీ ని ర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పిం చా రు. అనంతరం సిపిఐ నెక్కొండ మండల కార్యదర్శి కందిక చెన్నకేశవులు మా ట్లాడారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు కనుకుల దేవపాల మైదం యాక య్య తనుకుల సరిత, కుస లలిత, సింగం వెంకటలక్ష్మి, ఎండి అఫ్జల్, నీరటి రజిత , ఏడ రాధిక, కడగండ్ల యాకయ్య, ఐలయ్య, ముడుసు లక్ష్మి, నరసింహస్వామి, మనసు పద్మ, సావిత్రి, రఫియా, ఫయాజ్, చింత శీను, దబ్బెట వీరన్న, మీరా, జమున, ఇమాంబి తదితరులు పాల్గొన్నారు.
సంగెం : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ బడుగు, బలహీన వర్గాల కోసం చేసిన సేవలను దష్టిలో పెట్టుకొని ఆయన ఆశయాలను కొనసాగించాలని పరకాల శాసనసభ్యులు చల్లాధర్మారెడ్డి అన్నారు. మండ లంలో ని ఎల్గూర్‌రంగంపేట గ్రామ ప్రధాన కూడలిలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ నూతన విగ్రహాన్ని ఆవిష్కరించి పాలాభిషేకం చేసి పూల మాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మేల్యే మాట్లాడుతూ బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ చేసిన సేవలు విశిష్టమైనవని అన్నారు. మనమంతా అంబేద్కర్ ఆశ యాలను కొనసాగించాలన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ఆ మహానుభావుడి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తుందన్నారు.కుల నిర్మూలన కోసం అంబేద్కర్ ఎంతో కషి చే శాడన్నారు. ఈ రోజు మనం ఈ ప్రజాస్వామ్యాన్ని అనుభవిస్తున్నామంటే ఆ పు ణ్యం అంబేద్కర్ దేనని అన్నారు.
మండల కేంద్రంలో బి.ఆర్.అంబేడ్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ కందగట్ల కళావతి, జెడ్పీటీసీ గూడ సుదర్శన్ రెడ్డి, మండల రైతు సమన్వయ కమిటీ కన్వీన ర్ కందగట్ల నరహరి,జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షుడు పూలుగు సాగర్ రెడ్డి, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు గుండేటి బాబు,స్థానిక సర్పంచ్ పోతుల ప్ర భాకర్, ఎంపీటీసీ జనగాం పద్మ శ్రీనివాస్, సంగెం సొసైటీ చైర్మన్ వేల్పుల కుమా రస్వామి, వైస్ ఎంపీపీ బుక్క మల్లయ్య,వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీస ీలు, కార్యకర్తలు,తదితరులు, పాల్గొన్నారు.
బీజేపీ ఆధ్వర్యంలో....
డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షులు బుట్టి కుమారస్వామి ఆధ్వర్యంలో మండలంలోని బాబా సాహెబ్ అంబే ద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.అనంతరం ప్రజలకు పండ్లు,స్వీట్స్ పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎండి రహమతుల్లా, జక్క చేరాలు, రంగరాజు కృష్ణ, సపావట్ మహేందర్, నరహరి సమ్మిరెడ్డి, తక్కల్లపల్లి వెంక టేశ్వరరావు, ప్రకాష్ బాదావత్ రాజన్, రంగరాజు ప్రభాకర్, భయాగోని ఎల్ల గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
పర్వతగిరి : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్.అంబేద్కర్ 132వ జయంతి సందర్బంగా శుక్రవారం మండలం లోని ఆయా గ్రామాల్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు.మండలం లోని చింతనెక్కొండలో సర్పంచ్ గటిక సుష్మ మహేష్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్య క్రమంలో ఉప సర్పంచ్ దేవేందర్, మాజీ ఎంపీటీసీ శ్రీధర్, అంబేద్కర్ సంఘము గౌరవ అధ్యక్షులు దబ్బేట యాలాద్రి,అధ్యక్షులు శ్రీధర్ ఉపాధ్యక్షులు నవీన్, ప్రధా న కార్యదర్శి జీడీ ప్రసాద్, సమధ్యక్షులు జీడి వలరాజు, సంకినేని నరేష్, యూత్ సభ్యులు కరుణాకర్, విష్ణు, రవి, అన్వేష్,బన్నీ,మంట కిరణ్,జాశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.అలాగే మండలంలోని వడ్లకొండలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో సర్పంచ్, సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షుడు అమడ గాని రాజు యాదవ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
మండలంలోని ఏనుగల్ లో సర్పంచ్ ధంషెట్టి సంధ్యారాణి ఆధ్వర్యం లో జ యంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.అనంతరం బీ ఆర్ ఎస్ మండల యూత్ అధ్యక్షుడు గూడ నరేందర్ వర్మ అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబే ద్కర్ యువజన సంఘం సభ్యులకు టీ షర్టులు పంపిణీ చేశారు.మండల కేంద్రం లోని అల్లూరి సీతారామరాజు సెంటర్లో అల్లూరి యూత్ ఆధ్వర్యం లో స్థానిక సర్పంచ్ చింత పట్ల మాలతి సోమేశ్వరరావు అంబేద్కర్ జయంతి సందర్భంగా చి త్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమాల్లో సర్పంచ్ లు,ఎంపిటిసి లు,అంబేద్కర్ యువజన సంఘం నాయకులు పాల్గొన్నారు.
కాశిబుగ్గ : రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్.అంబేద్కర్ 132వ జయంతి వేడుకలను శుక్రవారం పలు ప్రాంతాల్లో ఘనంగా నిర్వహిం చా రు.14వ డివిజన్ ఎన్టీఆర్నగర్లో కేసీఆర్ యువసేన వరంగల్ ఉమ్మడి జిల్లా అ ధ్యక్షుడు కొమ్ము కుమారస్వామి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకల ను ఘ నంగా నిర్వహించి పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పెట్ట నగేష్ ఈర్ల రా జేందర్, కొత్తపల్లి యాదగిరి, కట్ల నాగరాజు, రమేష్ రెడ్డి, భరత్, వినరు, సరస్వ తి తదితరులు పాల్గొన్నారు.
బీఎస్పీ ఆధ్వర్యంలో....
బహుజన సమాజ్ పార్టీ వరంగల్ తూర్పు మహిళా విభాగం కన్వీనర్ పోతునూరి మౌనిక ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బిఎస్పి శ్రేణులు ఓసిటి గ్రౌండ్ నుండి కాశిబుగ్గ మీదగా గోపాల స్వామి గుడి లోని పార్టీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా మౌనిక మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చేది ఒక్క బీఎస్పీ పార్టీ మాత్రమేనని అన్నారు. కార్యక్రమంలో బి ఎస్ పి జి ల్లా అధ్యక్షుడు మంద శ్యామ్, తూర్పు అధ్యక్షుడు జన్ను భరత్, నాయకులు పుష్ప లత, సోమలక్ష్మి, నీలిమ, శ్రీలత, తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ ఆధ్వర్యంలో....
గ్రేటర్ వరంగల్ 19, 20వ డివిజన్ ల కార్పొరేటర్లు ఓని స్వర్ణలత భాస్కర్, గుండేటి నరేంద్ర కుమార్ల ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలను కాశిబు గ్గలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్లు స్వర్ణలత భాస్కర్, గుండేటి నరేంద్ర కుమార్‌లు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బయ్య స్వామి, నాయకులు గో రంట్ల మనోహర్, దుబ్బ శ్రీనివాస్, వేముల నాగరాజు, ఇక్బాల్, సోనిబాబు, పవన్, సురేష్, గోపి, రంజిత్, మోహన్, కిరణ్, కిషోర్, తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో...
వరంగల్ కూరగాయల మార్కెట్ వద్ద అంబేద్కర్ జయంతి వేడుకలను కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా పీసీసీ నా యకులు మీసాల ప్రకాష్, నల్గొండ రమేష్ లు అంబేద్కర్ చిత్రపటానికి పూలమా లలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కరా టే ప్రభాకర్, కూచన రవీందర్, నర్మెట్ట చిన్న, ఎర్రం కమల్, పోలేపాక విశాల్, అని ల్, దాసరి రాజేష్, బత్తుల వినోద్, బొట్ల ప్రసాద్, పుష్ప, నర్సయ్య, సతీష్, తది తరులు పాల్గొన్నారు.
నల్లబెల్లి : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అందరికీ ఆదర్శప్రాయుడు అని మాజీ ఎంపీపీ బానోతు సారంగపాణి తెలిపారు. అంబేద్కర్ 132వ జయంతిని పురస్క రించుకొని శుక్రవారం మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణంలో గల అంబేద్క ర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ డాక్టర్ బిఆర్.అంబేద్కర్ ప్రతి ఒక్క పౌరునికి ఆదర్శప్రాయుడని కొనియాడారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, భారతరత్న, దేశ రాజ్యాంగ నిర్మాత, దేశంలో ఓటు హక్కు కల్పించిన మహనీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రతి పౌరుడు పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్ర మంలో సర్పంచ్ నానబోయిన రాజారాం, కక్కెర్ల శ్రీనివాస్ గౌడ్, పాలెపు రాజేశ్వర రావు, కొత్తపల్లి కోటిలింగాచారి, క్లస్టర్ ఇంచార్జ్ గందే శ్రీనివాస్ గుప్తా, ఉప సర్పం చ్ దాసరి లతా నాగేశ్వరరావు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
మండలంలోని గ్రామ గ్రామాన అంబేద్కర్ 132వ జయంతి వేడుకలను ఎంతోఘనంగా నిర్వహించి సంబరాలను జరుపుకున్నారు. ప్రతి గ్రామపంచా యతీ కార్యాలయంలో ప్రభుత్వ కార్యాలయాలలో అంబేద్కర్ చిత్రపటానికి పూల మాలవేసి నివాళులు అర్పించి ఆయన దేశానికి చేసిన సేవలను గురించి కొనియా డారు. మండలంలోని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చిట్యాల తిరుపతిరెడ్డి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమం లో వైనాల అశోక్, చర్ల శివారెడ్డి, పెంతల కొమరారెడ్డి, సంపత్ రెడ్డి, రఘుపతి, తదితరులు పాల్గొన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో, తహ శీల్దార్ కార్యాలయంలో, గ్రామపంచాయతీ కార్యాలయంలో, ఇతర కార్యాలయా ల్లో అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని అధికారులు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులను అర్పించారు.
రాయపర్తి : భారత రాజ్యాంగ నిర్మాత, దేశ భవిష్యత్తుకు దిశా నిర్దేశం చూ పిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 132వ జయంతిని శుక్రవారం మం డలంలో ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలో బిఆర్ అంబేద్కర్, జగ్జీవన్ రామ్ విగ్రహాల కమిటీ ఆధ్వర్యంలో ఐత మల్లేష్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్య క్రమంలో పీఎస్సీఎస్ మాజీ చైర్మన్ బిల్లా సుధీర్ రెడ్డి, డీపీఓ కల్పన, ఎంపీపీ జిను గు అనిమిరెడ్డి, జడ్పీటీసీ రంగు కుమార్, తహశీల్దార్ సత్యనారాయణ, ఎస్సై బం డారి రాజు, దళితరత్న అవార్డ్ గ్రహీత ఐత యాకయ్య పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గన్నారంలో డాక్టర్ గన్నపురెడ్డి శ్రీరామ్ రెడ్డి అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయగా రిటైర్డ్ ఐపీఎస్ అధికారి కెఆర్ నాగరాజు ముఖ్యఅతిథిగా విచ్చేసి విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులర్పించగా గ్రామ సర్పంచ్ కుక్కల భాస్కర్, సాంబశివ, వెంకటచారి, గ్రామస్తులు పాల్గొన్నారు.
మాదిగ జేఏ సి ఉత్తర తెలంగాణ జిల్లాల ఇంచార్జ్ బరిగెల బాబు మాదిగ, సామాజిక కార్యకర్త వశపాక సుధాకర్ ఆధ్వర్యంలో తీర్మాలయపల్లి గ్రామంలో జయంతి సందర్భంగా సమావేశం నిర్వహించగా ఎంపీపీతో పాటు ప్రముఖులు పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించగా గ్రామ సర్పంచ్ గజ్జవెళ్లి అనంతప్రసాద్, బండి ఎల్లగౌడ్, తదితరులు పాల్గొన్నారు. కొం డూరు గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి కార్యక్రమం నిర్వహించగా గ్రామ సర్పంచ్ కర్ర సరిత రవీందర్ రెడ్డి, ఎంపీటీసీ చిర్ర ఉపేంద్ర, పెండ్లి రవీందర్, బాబు, సంతోష్ పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ని వాళులర్పించారు. దీంతోపాటు మైలారం, ఉకల్, పెర్కవేడు, వివిధ గ్రామాల్లో బ డుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ జయంతిని వేడుకగా నిర్వహించారు.
పింగిళి ప్రభుత్వ మహిళా కళాశాలలో...
ఎన్జీవోస్ కాలనీ : వడ్డేపల్లి లో గల పింగిలి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల (అటానమస్) లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 132వ జయంతి వేడుకను కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ చంద్రమౌళి ఆధ్వర్యంలో గురువారం రోజున పూలమాలవేసి ఘనంగా నిర్వహించినారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మన భారతదేశంలో పుట్టడమే మన అదష్టం అన్నారు అంబేద్కర్ ఒక మేధావిగా మరియు భారత రాజ్యాంగ నిర్మాత గా పేరు గడించిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ అని, సమాజంలో నెలకొన్న ఆర్థిక, సామాజిక అసమానతలను తొలగించుటకు నిరంతరం పాటుపడిన గొప్ప మహనీయుడు అంబేద్కర్ అని ఆయన అన్నారు. సమైక్య రాష్ట్రం నుండి తెలంగాణ ఏర్పాటు అనేది కూడా అంబేద్కర్ దూర దృష్టి ఫలితమే అని అన్నారు.
ప్రపంచంలోకెల్లా గొప్ప రాజ్యాంగాన్ని రచించి భారత ప్రజాస్వామ్నిక వ్యవస్థకు గట్టి పునాదులు వేసిన మహా మేధావి అంబేద్కర్ అని, నేటి విద్యార్థులు అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సుహాసిని అకాడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ పార్వతి కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ డాక్టర్ రామకష్ణారెడ్డి, డాక్టర్ సుమలత, డాక్టర్ స్నేహలత, డాక్టర్ రజిత, డాక్టర్ శ్యామల, డాక్టర్ రజిత, ఎన్సిసి ఇంచార్జ్ డాక్టర్ కల్పన , కోఆర్డినేటర్ రాధిక, రాజశ్రీ, విజయ శిరీష హెప్సిబా డాక్టర్ భాస్కర్, డాక్టర్ కుమారస్వామి ఇతర అధ్యాపకులు', నాన్ టీచింగ్ స్టాప్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.