Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మట్టెవాడ
డాక్టర్ బాబాసాహెబ్ 132వ జయంతి వేడుకలను సిఐటియు రంగసాయిపేట ఏరియా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిం చా రు. ఆర్టిఏ జంక్షన్ లో రంగ సాయిపేట ఏరియా కమిటీ ఆధ్వ ర్యంలో పార్టీ కార్యాలయంలో చేసి న కార్యక్రమంలో సిఐటియు వ రంగల్ జిల్లా అధ్యక్ష కార్యదర్శిలు, మాలోతు సాగర్, ముక్కెర రామ స్వామి లు అతిథిలుగా పాల్గొని బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం 9 సంవత్సరంలో దేశాన్ని పాలిస్తున్న బిజెపి ఆర్ఎస్ఎస్ విధానాలతో మతోన్మాదాన్ని పెంచి పోషిస్తూ ప్రజల మధ్య చిచ్చు పెడుతుందని ఇది దేశ అభివద్ధికి గొడ్డలి పెట్టు లాంటిదని అన్నారు.
అంబేద్కర్ ఆశయాలు ఆలోచనలకు తగ్గట్లుగా రాజ్యాంగానికి విరుద్ధంగా పరిపాలనలు కొనసాగుతున్నాయని దీనిపై ఐక్యంగా కార్మికులు కర్షకులు ప్రజానీకం పోరాడాల్సిన అవసరం ఎంతో ఉందని వారు నొక్కి చెప్పారు. బిజెపి పాలిత రాష్ట్రాలలో దళితులకు ముస్లింలకి క్రిస్టియన్లకి ఇతర మతస్థులకు ఏమాత్రం రక్షణ లేకుండా పోయిందని తెలంగాణలో టిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పటికీ వివిధ గ్రా మాలలో దళితులపై దాడులు జరుగుతూనే ఉన్నాయని దళితులను చిన్నచూపు ఇప్పటికీ చూస్తూనే ఉన్నారని మండిపడ్డారు. మత సామరస్యం అనేది మచ్చుకైనా కనిపిం చడం లేదని అంబేద్కర్ ఆశయ సాధన కోసం ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని ప్రతి ఒక్కరు ఉద్యమంలో పాల్గొని పాలకులకు వ్యతి రేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు ఏరియా కార్యదర్శి గానేపాక ఓదేలు, ప్రజా నాట్య మండలి జిల్లా కార్యదర్శి దుర్గయ్య, ఐద్వా మహిళా సంఘ ఏరియా కార్య దర్శి మాలోతు ప్రత్యూష, అధ్యక్షురాలు జ్యోతి, సోషల్ మీడియా కార్యదర్శి చందు, కెవిపిఎస్ ఏరియా కార్యదర్శి ఉసిల్లా కుమార్, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సాంబ మూర్తి, సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు రాధిక రిజ్వాన సుందరయ్య ఆటో యూ నియన్ అధ్యక్షులు మొగుళ్ల అనిల్, బాబురావు, సుందరయ్య భవన నిర్మాణ అధ్యక్షులు పెద్దరాజు ప్రకాష్ బొంత తదితరులు పాల్గొన్నారు.