Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ జిల్లా కార్యదర్శి కర్రే బిక్షపతి
నవతెలంగాణ-శాయంపేట
మండలంలోని పెద్దకోడపాక రెవెన్యూ శివారు సర్వేనెంబర్ 633 లో గుడిసె లు వేసుకున్న గుడిసె వాసులందరికీ ఇండ్ల పట్టాలు ఇవ్వాలని సిపిఐ జిల్లా కార్య దర్శి కర్రె బిక్షపతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.పెద్దకోడెపాక శివారులో గుడి సెలు వేసుకొని శుక్రవారం 100 రోజులు పూర్తయిన సందర్భాన్ని పురస్కరిం చు కొని గుడిసెవాసులందరూ కుటుంబ సభ్యులతో కలిసి గుడిసెలలో వంటా వార్పు కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు. ముందుగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్.అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమా లవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బిక్షపతి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభు త్వం నిరుపేదలందరికీ డబల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తామని హామీలు ఇచ్చి, ఇచ్చిన హామీలను ఇప్పటివరకు నెరవేర్చలేదని మండిపడ్డారు. డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వకపోవడంతో సిపిఐ ఆధ్వర్యంలో నిరుపేదలతో కలిసి ప్రభుత్వ భూములను గుర్తించి గుడిసెలు వేస్తున్నట్లు తెలిపారు. ఇండ్లనిర్మాణం చేపట్టే వరకు ఈ ఉద్య మం ఆగేది లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పరకాల సిపిఐ మండల కా ర్యదర్శి దుప్పటి సాంబయ్య, ఏఐటీయూసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బోట్ల ప్రభాకర్, బత్తిని సదానందం, అనుకారి అశోక్, అరికిళ్ల దేవయ్య, మారపల్లి క్రాంతి కుమార్, సాంబయ్య, రాములు, రాజమణి, రమ పాల్గొన్నారు.