Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హన్మకొండ
రాష్ట్ర ప్రభుత్వం కా ర్పొరేట్ ఆఫీసులకు ధీ టుగా కమ్యూనిటీ హాల్స్ ని నిర్మిస్తుందని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినరు భాస్కర్ అన్నారు. హన్మ కొండలోని ఏనుగుల గడ్డ లో నిర్మించిన భారతరత్న డాక్టర్ బిఆర్.అంబేద్కర్ మాల కులస్తుల కమ్యూ నిటీహాల్నుముఖ్య అతిథి గా హాజరై ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ మాట్లాడుతూ తెలంగా ణ రాష్ట్రం ఏర్పడినతర్వాత దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు సాగుతుం దన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా మాల కు లస్తుల కమ్యూనిటీ హాల్ నీ ప్రారంభించడం శుభసూ చకం అని కొనియాడారు కార్పొరేట్ ఆఫీసులకు దీటు గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కమ్యూనిటీ హల్స్ ని ర్మిస్తుందన్నారు. కమ్యూనిటీ హాల్ లో తన వేతనం నుండి కొంత వెచ్చించి ఫర్నిచర్, లైబ్రరీకి బుక్స్ సమకూరుస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు చీకటి శారద ఆనంద్, బైరి లక్ష్మీ, వేముల శ్రీనివాస్, కులసంఘం నాయకులు పాల్గొన్నారు.