Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జిల్లా అధ్యక్షులు టి.ఉప్పలయ్య
నవతెలంగాణ-హనుమకొండ
భారత దేశం కన్న ముద్దుబిడ్డ, భారతరత్న, రాజ్యాంగ నిర్మాత డా క్టర్ బి.ఆర్ అంబేద్కర్ 132 వ జ యంతి సందర్భంగా అన్ని దళిత సం ఘాలు, రాజకీయ పార్టీలు అత్యంత ఘనంగా దండలు వేసిదండాలు పె ట్టి చేతులు దులుపుకోవడం కాదని, అంతటి తోటి బాధ్యత అయిపోయిన ట్టు భావించరాదని, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తన జీవితం భారత ప్రజలందరి కోసం ఎన్నోఅవమానాలు, త్యాగాలుభరించి ఉన్నత చదువు లు చదివి, భారత సామాజిక వ్యవస్థలో అనేక ప్రత్యక్ష పోరాటాలలో చెరువుల్లో నీళ్లు తాగడానికి, దేవాల యంలో దేవుడిని పూజించుకోవడానికి, దళితులు, శూద్ర జాతులందరికీ హక్కు ఉందని ప్రత్యక్ష పోరా టాల ద్వారా, ఆ హక్కును సాధించడం జరిగిందని శుక్రవారం హనుమకొండలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్క ర్ జయంతి సందర్భంగా జరిగిన జయంతి సభలో టీ.ఉప్పలయ్య ప్రధానో ఉపన్యాసం చేశారు. సిఐటి యు, కెవిపిఎస్, టీజీఎస్, ఐద్వా ప్రజా సంఘాల ఆ ధ్వర్యంలో డాక్టర్ బిఆర్.అంబేద్కర్ 132వ జయంతి సభను నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా టి ఉప్పలయ్య మాట్లాడుతూ దేశంలో ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో నడిచే కేంద్ర ప్రభు త్వం డాక్టర్ బి.ఆర్ అంబే ద్కర్ రాసిన రాజ్యాంగాన్ని రద్దుచేసి, దానిస్థానంలో ప్రాచీనకాలం నాటి మను ధర్మశాస్త్రాన్ని భారతరాజ్యాంగంగా తీసుకురావాలని, అందుకు హిందూ రాష్ట్రాన్ని ఏర్పాటుచేయాలని, బిజె పి ప్రభుత్వం ఉందని ప్రజా సంపద, ప్రభుత్వ సంపదతో నిర్మించిన ప్రభుత్వ రంగ సంస్థలన్నీ తన రాష్ట్ర దోపిడివర్గాలైన అంబా నీ ఆదానీలకు దోచిపెట్ట డానికి పూనుకుంటుందని విమర్శించారు. హిందు త్వ, మనుధర్మశాస్త్రంలో కు ల, మత అసమానతల తో కూడినవర్నాశ్రమాలు ధర్మాలు పాటించాలని ఏ కులంలో పుట్టిన వాడు, ఆ కులవత్తులనే ఆచరింప జేసే, ఫాసిస్టు విధానాన్ని తీసుకురావాలని బిజెపి, ఆర్ఎస్ఎస్లు కుట్రలు పలుతున్నారని విమర్శించా రు. కావున ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడు, అంబే ద్కర్ ఆశయ సాధకులు, దళిత సంఘాలు, రాజకీయ పార్టీలు రాజకీయాలు, అధికారం కోసం కాకుండా, ని జాయితీగా భారత రాజ్యాంగాన్ని రక్షిస్తూ, అంబేద్కర్ ఆశయ సాధనకు నిరంతరం కషి చేయాలని, అందు కు కార్మిక కర్షకులు, అన్ని తరగతుల ప్రజలు సామా జికవర్గ పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో టీజీఎస్ జిల్లా కార్యదర్శి వాంకుడోత్ వీరన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి లచ్చల్ దీప, సిఐటియు నాయకులు కుక్కమూడి రవీందర్, భానోత్ వెంకన్న, వల్లెపు రాజు, లింగమూర్తి, కొము రెల్లి, జగను రాజేష్, నాయకులు, జయశ్రీ, మంజుల, పద్మ,రమ,ప్రసన్న,కేవీపీఎస్నాయకులు పాల్గొన్నారు.