Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే
నవతెలంగాణ-వరంగల్
భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయ సా ధనకై కృషి చేయాలని అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ అశ్విని తానాజీ వాకాడే అన్నారు. శుక్రవారం వరంగ ల్ జిల్లాలో కాశీబుగ్గ సర్కిల్ ఏరియాలో అంబేద్కర్ వి గ్రహానికి స్థానిక శాసనసభ్యులునన్నపునేని నరేందర్, అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ వాకా డే, శ్రీవత్స, వివిధ కుల సంఘాల పెద్దలు, టీఎన్జీఎస్ నాయకులు తో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిం చారు. అనం తరం కాశిబుగ్గ ఏరి యా లో గల డీసెంట్ ఫంక్షన్ హాల్లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 132వ జయం తి ఉత్సవాలను జిల్లా సో షల్ వెల్ఫేర్ శాఖ ఆధ్వ ర్యంలో స్థానిక కులసంఘాల నాయకులు, ప్రజాప్రతి నిధులు ప్రభుత్వ అధికారుల సమక్షంలో అదనపు కలెక్టర్లు జ్యోతిప్రజ్వలన చేసి అంబేద్కర్ చిత్రపటాని కి పూల మాలలు వేసిఘనంగా నివాళులర్పించారు. ముందుగా అంబేద్కర్ కులసంఘ నాయకులు డా క్టర్ బి.ఆర్ అంబేద్కర్ గొప్పతనాన్ని వారి మాటల ద్వారా విన్న అనంతరం అదనపు కలెక్టర్ లోకల్ తా నాజీ మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మేధా వి, సంఘసంస్కర్త ,భారత రాజ్యాంగ నిర్మాత, లోకం గర్వించదగ్గ వ్యక్తి, సమాజానికి ఎంతో మేలు చేసిన వ్యక్తి అని అలాంటి వ్యక్తి జన్మదినాన్ని జరుపుకోవడం లో ఆనందంగా ఉందని చెప్పారు. రాజ్యాంగ ముసా యిదా కమిటీ ఛైర్మన్గా పనిచేసిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, భారతీయులు సార్వజనీన వయోజన ఓ టుహక్కును పొందటంలో కీలకపాత్ర పోషించారన్నా రు. అదనపు కలెక్టర్ శ్రీవత్సకోట మాట్లాడుతూ అం బేద్కర్ స్ఫూర్తిదాయకంగా ఆయన బాటలో మనం న డవాలని అన్నారు. ఎందరో సంఘసంస్కర్తలను మన స్మరించుకుంటూ ఉంటున్నామని మన రాష్ట్ర ప్రభు త్వం బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చే యడం అంతపెద్ద విగ్రహం భారత దేశంలో ఎక్కడా లేదన్నారు.
ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ నాయకులు ఆరూ రికుమార్, ఎమ్మెస్పీ జిల్లా ఇన్చార్జి బిర్రు మహేందర్, విజరు, అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.