Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చైర్మన్ బాల్దె సిద్ధి లింగం
నవతెలంగాణ-జనగామ
రైతుల ప్రయోజనాల కోసం వ్య వసాయ మార్కెట్ కమిటీ లక్ష్యంగా పనిచేస్తుందనిజనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్దె సిద్ధి లింగం అన్నారు. శనివారం వ్యవ సా య మార్కెట్ కమిటీ జనగామ కార్యా లయంలో పాలకవర్గ మొదటి సమా వేశం బాల్దె సిద్ధి లింగం గారి అధ్య క్షతన జరిగినది. ఇట్టి సమావేశం నం దు నూతన కవార్డ్ షెడ్ నిర్మాణము పూర్తి చేయుటకు ప్రతిపాద నలు పంపుట గురించి, మార్కెట్ యార్డు నందు రైతులకు, వ్యాపారులకు, విని యోగదారులకు ఐదు రూపాయల భోజనము పెట్టు ట గురించి కమిటీ సమావేశము నందు ప్రతిపాద నలు పంపుటకు తీర్మానించనైనది. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ రైతులు పండించే ప్రతి పంట కు గిట్టుబాటు ధర లభించేందుకు చర్యలు తీసుకుం టామన్నారు.ఎలాంటి దళారుల బెడద లేకుండా రైతు లు నేరుగా మార్కెట్ యార్డులో పండించిన పంట లను అమ్ముకోవాలని సూచించారు.ఈ సమావేశంలో వైస్ చైర్మన్ మూసిపట్ల విజరు కుమార్ , మున్సిపల్ చైర్మన్ గోకుల జమున, జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి కె.నాగేశ్వర శర్మ, కమిటీ సభ్యులు మాల రా జు, శివరాత్రి రాజ్ కుమార్, నూనెముంతల యా కస్వామి, బసవ గాని బాల మల్లేష్, సేవెల్లి మధు సూదన్, గువ్వల రవి, బూశిగంపల ఆంజనేయులు, జి.జీవన్ కుమార్,బి.శ్రీనివాస్ పాల్గొన్నారు.