Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సిట్టింగుల్లోగుబులు
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
బీఆర్ఎస్ నాయకత్వం ఆదేశాలమేరకు నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాల లో పలు నియోజకవర్గాల్లో అసమ్మతి బహిర్గతం కావడం అటు ఆ పార్టీ వర్గాలను, ఇటుపార్టీ నాయకత్వాన్ని నివ్వెరపరిచేలా చేస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా లోని స్టేషన్‌ఘన్‌పూర్, డోర్నకల్ నియోజకవర్గాల్లో బిఆర్ఎస్ పార్టీలోని వర్గపోరు బహిర్గతమైంది. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలో మంత్రి సత్య వతి రాథోడ్‌ను లక్ష్యంగా చేసుకొని ఎమ్మెల్యే రెడ్యానాయక్ కుటుంబసభ్యులు విమ ర్శలు చేసిన విషయం విదితమే. ఈ క్రమంలో తాజాగా మంత్రి సత్యవతి రాథోడ్ ఒక సమావేశంలో తాను పోటీ చేయాల్సివస్తే, పార్టీ అధిష్టానం కోరితే డోర్నకల్ నుండి మాత్రమే పోటీ చేస్తానని ప్రకటించడం గమనార్హం. ఇదిలావుంటే బీఆర్ ఎస్ ఆత్మీయ సమ్మేళనాలకు నన్ను ఆహ్వానించడం లేదని మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి నేరుగా స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యపై ఆరో పించడం చర్చనీయాంశంగా మారింది.
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని స్టేషన్‌ఘన్‌పూర్, డోర్నకల్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలలో అసమ్మతి బహిర్గతమైంది. బిఆర్ఎస్ అధిష్టా నం ఆదేశాల మేరకు అన్ని నియోజకవర్గాల్లో ఆత్మీయ సమ్మేళనాల పేరిట సమావే శాలను నిర్వహించి రానున్న ఎన్నికలకు పార్టీశ్రేణులను సమాయత్తం చేస్తున్న విషయం విదితమే. ఈ క్రమంలో జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవ ర్గంలో బీఆర్ఎస్ రెండు వర్గాలుగా చీలివుండడం, ఒక వర్గానికి ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, మరోవర్గానికి ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య నాయకత్వం వహిస్తు న్న విషయం విదితమే. ఈ క్రమంలో ఆత్మీయ సమ్మేళనాలకు నన్ను ఆహ్వానిం చడంలేదని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ప్రకటించారు. ఇక్కడ జరుగుతున్న వ్యవహా రాలు సిఎం కేసీఆర్ దృష్టిలో వున్నాయని సైతం ప్రకటించడం పార్టీ వర్గాల్లో చర్చ నీయాంశంగా మారింది. నియోజకవర్గంలో ఈ రెండు వర్గాల మధ్య పొసగడం లేదు. చాలాకాలంగా ఈఇద్దరు నేతల మధ్య వున్న వైరుధ్యాలు పార్టీలో గందరగోళ పరిస్థితిని నెలకొల్పాయి. నియోజకవర్గంలో ఈ ఇరువురు నేతల మధ్య సయోధ్య కుదర్చడం పార్టీపెద్దలకు సైతం తలనొప్పిగా పరిణమించింది. ఆత్మీయ సమ్మేళనా లలో ఐక్యతారాగంతో ముందుకు వెళ్లాల్సిన నేతలు పరస్పరం విమర్శలు గుప్పిం చుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ నియోజకవర్గంలో పార్టీ రెండుగా చీలివుండడం ఇదే కొనసాగితే భవిష్యత్ ఎన్నికల్లో పార్టీకి ఇబ్బందికరంగా మారే అవకాశం లేకపోలేదు. 'కడియం', 'తాటికొండ'ల మధ్య సఖ్యత కుదర్చకపోతే వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్కు నష్టం తప్పదని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
మంత్రిపై 'రెడ్యా' ఆరోపణలు..
రాష్ట్ర గిరిజన సంక్షేమం, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌పై డోర్నకల్ ఎమ్మెల్యే డిఎస్ రెడ్యానాయక్ ఆత్మీయ సమ్మేళనంలో నేరుగా విమర్శలు ఎక్కుపెట్టారు. ఇదే వేదికపై ఎమ్మెల్యే రెడ్యానాయక్ కూతురు, మహబూ బాబాద్ జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షురాలు, ఎంపి కవితతోపాటు 'రెడ్యా' కుమారుడు సై తం మంత్రిపై విమర్శలు గుప్పించడం గమనార్హం. ఈ ఆత్మీయ సమ్మేళనం నే పథ్యంలో మంత్రి సత్యవతి రాథోడ్‌ను లక్ష్యం చేసుకొని ముగ్గురు నేతలు ఆరోపణ లు చేయడం చర్చనీయాంశంగా మారింది. తనను ఓడించడానికి కుట్ర చేసిందని నేరుగా 'రెడ్యా' ఆరోపణలు చేశారు. దీంతో డోర్నకల్‌లో చాలా కాలం తరువాత మంత్రి సత్యవతి, ఎమ్మెల్యే రెడ్యాల మధ్య విభేధాలు బహిర్గతమయ్యాయి.
కుటుంబంలో ఐక్యతారాగం..
డోర్నకల్ ఎమ్మెల్యే డిఎస్.రెడ్యానాయక్ కుటుంబంలో ఐక్యతారాగం వినిపి స్తుంది. తాజాగా ఆ నియోజకవర్గంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో 'రెడ్యా' ఆ యన కూతురు ఎంపి కవిత, కుమారుడు మూకుమ్మడిగా మంత్రి సత్యవతి రా థోడ్పై ధ్వజమెత్తడం ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. ఇటీవలి కాలం వరకు ఎంపి మాలోత్కవిత మహబూబాబాద్ అసెంబ్లీ టికెట్నాశిస్తూ తన ప్రయత్నా లను ముమ్మరం చేయగా, తాజాగా డోర్నకల్ నియోజకవర్గంపై దృష్టి మళ్లించిన ట్లు ప్రచారం జరుగుతుంది. దీంతో కవిత మహబూబాబాద్ నియోజకవర్గాన్ని వదిలేసిందన్న వార్త హాట్ టాపిక్‌గా మారింది. ఎమ్మెల్యే డిఎస్ రెడ్యానాయక్ వచ్చే ఎన్నికల్లో తాను కాకుండా తనకుమార్తె కవితను ఎమ్మెల్యే బరిలో నిలిపే అవకాశా లు కనిపిస్తున్నాయి. రెండు నియోజకవర్గాలపై దృష్టి పెడితే నష్టం జరిగే అవకాశ ముందని భావించడం వల్లే ఎట్టిపరిస్థితిలో డోర్నకల్ నియోజకవర్గాన్ని వదులు కోవద్దనే యోచనతోనే ఆత్మీయ సమ్మేళనంలో మంత్రిపై నేరుగా ఆరోపణలు చేశా రని పరిశీలకులు భావిస్తున్నారు. ఇటీవల ఎంపి కవిత మహబూబాబాద్ నియో జకవర్గంలో పర్యటించడం మానుకోవడం, పార్లమెంటు నియోజకవర్గంలో మహ బూబాబాద్ నియోజకవర్గాన్ని మినహాయించి మిగతా నియోజకవర్గాల్లో పర్యటి స్తూ, మిగతా సమయం డోర్నకల్ నియోజకవర్గంలోనే ఎక్కువ సమయం కేటా యించడం చర్చనీయాంశంగా మారింది.
పోటీ చేస్తే డోర్నకల్‌లోనే.. : మంత్రి సత్యవతి రాథోడ్
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాల్సి వస్తే డోర్నకల్ నియోజకవర్గం నుండే పో టీ చేస్తానని రాష్ట్ర గిరిజన సంక్షేమం, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్య వతి రాథోడ్ స్పష్టం చేశారు. తాజాగా ఖైరతాబాద్‌లో డోర్నకల్ నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు, స్థానికులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈమేరకు మంత్రి వ్యాఖ్యానించడం గమనార్హం. పార్టీ నాయకత్వం తనను పోటీ చేయమన్న, నేను పోటీ చేయాలనుకున్న డోర్నకల్ నుండే పోటీ చేస్తానని వ్యాఖ్యానించడం గమనార్హం. దీంతో డోర్నకల్ బీఆర్ఎస్లో వర్గపోరు తప్పదనేది తేటతెల్లమైంది.