Authorization
Wed April 09, 2025 11:37:15 am
నవతెలంగాణ-మల్హర్రావు
మండల కేంద్రమైన తాడిచెర్ల గ్రామంలో శ్రీ రామ ఆంజనేయ కళా బృందం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ కుషలవ యాజ్ఞగాన నాటిక కళా ప్రదర్శనకు ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, కాటారం పీఏసీఎస్ చైర్మన్ చల్ల నారాయణ రెడ్డి, ఎంపిపి చింతలపల్లి మల్హర్ రావు హాజరై నాటిక కళా ప్రదర్శన ప్రారంభించారు. అనంతరం కళా బృందానికి రూ.5వేల విరాళం అందించారు. కళా బృందం, ప్రజా ప్రతినిధులు శాలువాతో సన్మా నించారు. ఈ సంధర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత కళాకారులు కళకు జీవం పోస్తున్నారని తెలిపారు.ఈ ప్రదర్శనను తిలకించడానికి అధిక సంఖ్యలో సందర్శకులు పాల్గొన్నారు.