Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - జనగామ కలెక్టరేట్
జిల్లా అభివృద్ధికి అధికారులు నిబద్దతతో, సమన్వయంతో కలిసి పని చేయా లని జిల్లా కలెక్టర్ సిహెచ్ శివ లింగయ్య అదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఆయన వివిధ అభివృద్ది పనులపై మూడు నియోజక వర్గాలపై అదనసు కలెక్టర్ ప్రఫుల్ దేశారుతో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టా త్మకంగా గ్రామాల అభివృద్ది పనులను జనగామ, పాలకుర్తి, స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గాల వారీగా సాధించిన ప్రగతని సమీక్షించారు. అంతర్గత రోడ్లు, పాఠశాలలు, తెలంగాణ క్రీడా ప్రాంగణాలు, వైకుంఠథామాలు, నర్సరీలు, పల్లె ప్రగి వనాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, రైతు వేదికలు, తాగు నీరు, సాగు నీరు, విద్యుత్, దళితుల ఆర్థిక అభివృధ్ది కోసం చేపట్టిన దళిత బంధు, రైతు బంధు, రైతు భీమా, రెండు పడక గదల నిర్మాణం, ఇరిగేషన్ ప్రాజెక్టులు, జనగామలో చేయబోయే మెడికల్ కళాశాల నిర్మాణం, రేడియోలాజీ ల్యాబ్ తదితర పనులపై నియోజకవర్గ స్థాయిలో ప్రగతి ప్రణాళికలను ఛాయా చిత్రా లతో సహా ముఖ్య ప్రణాళిక అధికారి ఈనెల 28 లోను నివేదిక అందజేయాలని ఆదేశాంచారు. జిల్లా గ్రామీణాభివృద్ది ఉపాధి హామీ పథకంలో జరుగుతున్న పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. కుల వృత్తులకు అధిక ప్రాధాన్యతనిస్తూ గెర్రెల పంపిణీకి సిద్దింగా ఉండాలని, ప్రభుత్వం సూచనల మేరకు 12 మండలాలకు ప్రత్యేక అధికారులను నియమించి గొర్రెల కొనుగోలును వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎం ఇస్మాయిల్, డీఆర్డీఏ పిడి రాంరెడ్డి, అధికారులు పాల్గొన్నారు.