Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సభాస్థలి పరిశీలించిన ఎమ్మెల్యే రాజయ్య
నవతెలంగాణ - స్టేషన్‌ఘన్‌పూర్
భారత రాష్ట్ర సమితి పార్టీ జాతీయ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు ఈనెల 25న నియోజక వర్గ కేంద్రంలో నియోజక వర్గ ప్రతినిధుల సభ (మినీ ప్లీనరీ) నిర్వహించనుండగా శుక్రవారం మాజీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య సభాస్థలిని, మండల అధ్యక్షుడు మాచర్ల గణేష్ ఆధ్వర్యంలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 4వేల మందితో నియోజకవర్గ ప్లీనరీ ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని ఏడు మండలాల నుంచి పార్టీ శ్రేణులను తరలించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని అన్నారు. ప్లీనరీ సమావేశంలో పార్టీ జెండా మొదటగా ఎగురవేసి ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. రెండో విడత ఆత్మీయ సమావేశాలు మే నెలలో 5న కరుణాపురం, 12న మీదికొండ, 17 న కళ్లెం, 21న ఖిలాషాపూర్, 26న మల్కాపూర్ క్లస్టర్లలో జరుగుతాయని తెలి పారు. ప్లీనరీకి అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలు నిచ్చారు. నియోజక వర్గ నాయకులు గట్టు రమేష్, నాగరబోయిన శ్రీరాములు, తోట సత్యం, నెలమంచ అజరు రెడ్డి, మంతపురం ఎల్లా గౌడ్, గుర్రం ఏసుబాబు ఎంపిటిసి గుర్రం రాజు, చింత శ్రీను, జ్యోతి రెడ్డి, మౌనిక, కలకోల నరేందర్, జింక బిక్షపతి, జోగు కుమార్, రైమాన్, తదితరులు పాల్గొన్నారు.
మారు మూల గ్రామాల రోడ్ల అభివద్దే కెసిఆర్ ప్రత్యేక ప్రణాళిక
రఘునాథపల్లి : మారు మూల గ్రామాల్లో సైతం ప్రతి గ్రామాన్ని అభివద్ధి చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రణాళిక సిద్ధం చేశారని, సంక్షేమ పథకాలు అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కిందని మాజీ డిప్యూటీ సీఎం ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. శుక్రవారం రఘునాథ్ పల్లి మండలం ఇబ్రహీంపురం లక్ష్మీ తండా మాదారం గ్రామాలలో ఐకేపీ ఆధ్వర్యంలో చేపట్టిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. వెల్డిగ్రామంలో 32 లక్షలతో చేపట్టిన బ్రిడ్జి పనులకు శంకుస్థాపన చేశారు. దేశంలో ఎక్కలేని సంక్షేమ పథకాలు తెలంగా ణలో అమలవుతున్నాయని అన్నారు. రాష్ట్రంలోఅభివృద్ధిలో నియోజవర్గం నాలుగో స్థానంలో నిలిచిందని తెలిపారు.. గడపగడపకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని వివరించారు. గతంలో ఏ ప్రభుత్వాలు చేయని సంక్షేమ పథకాలను చేశారు ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేసిందని తెలిపారు. ఈనెల 25న స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ కేంద్రంలో మినీ ప్లీనరీ ఏర్పాటుకు సిద్ధం చేశామని అన్నారు. పిఆర్ డిఈ శ్రీనివాస్, జెడ్పీటీసీ అజరు మణికంఠ, బి ఆర్ఎస్ మండల అధ్యక్ష కార్యదర్శులు వరాల రమేష్ యాదవ్ అశోక్, మార్కెట్ వైస్ చైర్మన్ ముసిపట్ల విజరు, డైరెక్టర్లు నూనె ముందల యక స్వామి గౌడ్, రాజ్, స్టేషన్గన్పూర్ నియోజకవర్గ మహిళా నాయకురాలు మట్లపల్లి సునీత రాజు తిప్పారపు రమ్య బాబురావు, మంజుల, రవి, బుచ్చయ్య గౌడ్, మల్లారెడ్డి చెంచు రమేష్, వివిధ గ్రామాల అధ్యక్ష కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.