Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జనగామ
ఐకేపీ ధాన్యపు కొనుగోలు కేంద్రాలలో హమాలి కార్మికుల కోసం హమాలి రేట్ల పట్టిక ప్రభుత్వం ఏర్పాటు చేసి అమలు చేయాలని తాడు, మాములు ఇవ్వా లని కోరుతూ శుక్రవారం ఆల్ హమాలి వర్కర్స్ యూనియన్ (సిఐటియు) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో కలెక్టర్ శివలింగయ్యకు వినతి పత్రం అందజే శారు. యూనియన్ రాష్ట్ర కార్యదర్శి రాపర్తి రాజు మాట్లాడుతూ రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పని చేసే హమాలి కార్మికుల సౌకర్యార్థం ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం సమంజసం కాదన్నారు. కొనుగోలు కేంద్రాలలో హమాలి రేట్లు క్వింటానుకు 55 రూపాయలు ప్రభుత్వమే నిర్ణయించి నిర్ణయించిన ప్రకారం డబ్బులు ప్రభుత్వమే చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతుల వద్ద నుండి వసూలు చేయవద్దు అన్నారు. ఐకేపి కొనుగోలు కేంద్రాల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని హమాలి కార్మికులకు రెండు జతల బట్టలు యూని ఫామ్స్ చెప్పులు ఇవ్వాలని అన్నారు. తాడుమామలు తప్పనిసరిగా ఇవ్వాలని డి మాండ్ చేశారు. ప్రమాద బీమా పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని అన్నారు. 50 సంవత్సరాలు దాటిన హమాలి కార్మికులకు నెలకు రూ . 6000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని కోరారు. ఈ క్రమంలో సిఐటియు జిల్లా కోశాధి కారి సుంచు విజేందర్, హమాలి యూనియన్ జిల్లా అధ్యక్షులు అపరాధపు రాజు, రాష్ట్ర కమిటీ సభ్యులు బైరగోని బాలరాజు గౌడ్, యూనియన్ జిల్లా నాయ కులు అన్నెబోయిన రాజు, పండుగ రాజారాం, మద్దూరి యాదగిరి, శ్రీరాముల శ్రీనివాస్, కొన్నే రవీందర్ తదిరులు పాల్గొన్నారు.