Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి
నవతెలంగాణ-జనగామ
జనగామ జిల్లాను మెడికల్ హబ్ గా తీర్చిదిద్దేందుకు టిఆర్ఎస్ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అన్నారు. శుక్రవారం జనగామ పట్టణంలోని మున్సిపల్ రోడ్డులో కోటి రూపాయల వ్యయంతో నిర్మించిన టీ హబ్ రేడియాలజీ ల్యాబ్ మామో గ్రామ్, టుడీ ఈకో, 500 ఎక్స్రే మిషిన్ అల్ట్రా సౌండ్ స్కాన్ క్రేయో థెరపీ, కోల్పో స్కోపిలను అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశారు, మున్సిపల్ చైర్ పర్సన్ పోకల జమునతో కలిసి ఆయన ప్రారంభించారు. అంతకుముందు చంపక్ హిల్స్ లోని ఎంసీఏ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన పీడియా ట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ను ప్రారంభించారు. అలాగే నూతనంగా నిర్వహించబోతుందా మెడికల్ కాలేజీ ఏర్పాటు పనులను ఎమ్మెల్యే తిరిగి పరిశీలిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలం గాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చిన్న జిల్లాల అభివద్ధి వేగవంతంగా జరుగుతుందని అందులో భాగంగానే ఉమ్మడి వరంగల్ జిల్లా హైదరాబాద్కు కూతవేటు దూరంలో ఉన్న జనగామ జిల్లా ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. పేదల కు ఉచిత వైద్యం అందించేందుకు ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశ పెడుతూ ఉందని అన్నారు. ఇప్పటికే తెలం గాణ డయాగ్నొస్టిక్ సెంటర్ టి హబ్, ఏర్పాటుచేసి అత్యుత్తమ సేవలు అందించు దేశంలో మంచి గుర్తింపు సాధించిందని అన్నారు. మాత శిశు సం రక్షణ కేంద్రం పరిధిలో ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస వాలు పిల్లలకు తల్లులకు అందుతున్న వైద్య సేవలపై జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఆస్ప త్రిగా అవార్డులు అందుకుందని గుర్తుకు చేశారు. జిల్లా కేంద్రంలో 100 సీట్లతో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసినారని వచ్చే విద్యా సంవత్సరం నుండి తరగతులకు ప్రారంభం కానున్నాయని అన్నారు. ఈరోజు ప్రారంభించిన రేడియాలజీ ల్యాబ్ లో ఆడవారికి సంబంధించిన రొమ్ము క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ వివిధ రకాల క్యాన్సర్లను, గుండెకు సంబం ధించిన వ్యాధులు వయసులతో తేడా లేకుండా అన్ని వర్గాల వారికి వైద్య పరీక్షలు అందించేందుకు సు మారు కోటి రూపాయలతో అత్యాధునిక వైద్య పరిక రాలు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. ప్రజలు వినియోగించుకోవాలని కోరారు, ఈ కార్యక్ర మంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బల్డే సిద్దిలింగం, ఏరియా హాస్పిటల్ సూపర్డెంట్ డాక్టర్ సుగుణాకర్ రాజు, వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రవీందర్ గౌడ్, వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ గోపాల్ రావు, జడ్పిటిసి దీప్తి, ఎంపీపీ కళింగరాజు, స్థానిక కౌన్సిలర్ కళ్యాణి, జనగామ పుర ప్రముఖులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.