Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మట్టెవాడ
అఖిలభారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) తెలంగాణ రాష్ట్ర రెండవ మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ సోమవారం నగరంలోని హెడ్ పోస్ట్ ఆఫీస్ సెంటర్లో సంఘం నాయకులు పోస్టర్ ఆవిష్కరన కార్యక్రమాన్ని నిర్వ హించారు. ఈ సందర్భంగా ఏఐకేఎంఎస్ జిల్లా నాయకులు రాచర్ల బాలరాజు మా ట్లాడుతూ యాదాద్రి జిల్లా ఆలేరులో సంఘం మహాసభలు ఈనెల 25,26,27 తేదీలలో జరుగుతాయని మొదటి రోజైన 25వ తేదీన మధ్యాహ్నం 12 గంటల కు మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణం నుండి రైతుకూలీ, ప్రదర్శన ప్రారంభ మవుతుందని మధ్యాహ్నం రెండు గంటలకు బహిరంగ సభ జరుగుతుందని తెలి పారు. ఈ సభకు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కే.అచ్యుత రామారావు అధ్యక్షత వహి స్తారని ప్రధానవక్తగా సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి ప్ర సంగిస్తారని తెలిపారు.ఇతర వక్తలుగా ఏఐకేఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.ర ణధీర్, ఉపాధ్యక్షులు మామిడాల బిక్షపతి రాష్ట్ర సహాయ, కార్యదర్శులు గౌని ఐల య్య, బి.భాస్కర్లతోపాటు యాదాద్రి జిల్లా సంఘం అధ్యక్షులు కళ్లెపు అడివయ్య, న్యూ డెమోక్రసీ పార్టీ ఆలేరు డివిజన్ కార్యదర్శి ఇక్కిరి సహదేవ్లు ప్రసంగిస్తారని, అనంతరం అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య కళాకారులచే ప్రదర్శనలు ఉంటా యని వారు తెలిపారు. 25,26 తేదీలలో కామ్రేడ్ బేబక్కనగర్ కన్వెన్షన్ హాలులో ప్రతినిధుల సభ ఉంటుందన్నారు. ఏఐకేఎంఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి అశోక్ గాయల్, మహాసభలు ప్రారంభిస్తారని ముంచుకొస్తున్న ఫాసిజం అనే అంశంపై హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ ప్రమాదంలో వ్య వసాయ రంగం అను అంశంపై ఏఐకేఎంఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ చిట్టిపాటి వెంకటేశ్వర్ల, రైతు స్వరాజ్య వేదిక నాయకులు కన్నెగంటి రవి రైతుకు దక్కని మద్దతు ధర అనే అంశంపై ప్రసంగిస్తారని వారు తెలిపారు.ఈ మహాసభల లో సంఘం నాయకత్వన జరిగిన రైతాంగ ఉద్యమాల సమీక్షతోపాటు భవిష్యత్ కార్యాచరణ కూడా ఉంటుందని వారుతెలిపారు.మహాసభలను జయప్రదం చే యాలని జిల్లా రైతాంగం నాయకులు కోరారు.ఈ కార్యక్రమంలో ఇనుముల కృష్ణ, ఎండి అక్బర్, పాపయ్య, అమర్, చేరాలు, కుమార్ స్వామిలు పాల్గొన్నారు.