Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహబూబాబాద్
ప్రజా సమస్యలపై దరఖాస్తులు ఏవైనా ఉంటే వాటిని త్వరగా పరిష్కారం చేయాలని కలెక్టర్ అధికా రులతో అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్లు అభిలాష అభినవ్, ఎం.డేవిడ్‌లతో కలిసి ప్ర జల నుండి పలు సమస్యలపై దరఖాస్తులను స్వీకరిం చారు. ఈ సందర్భంగా గార్ల మండలం జండా బజా రు కాలనీవాసులు మిషన్ భగీరథ నీటి కొరకు పైపు లైను వేసి ఇంతవరకు నీళ్ళ కనెక్షన్ ఇవ్వలేదని విచా రించి మా యొక్క నీటి సమస్యను పరిష్కరించాలని కోరారు. గార్ల మండలం గోపాలపురం గ్రామపంచా యతీకి చెందిన మాలోతు మాన్య ఉపాధి హామీ పథ కం భూ అభివృద్ధి పథకంలో భావి మంజూరు కాగా 2011 సంవత్సరంలో ప్రారంభించి 25 ఫీట్లు తవ్వి న తర్వాత రాయి రావడం వలన బ్లాస్టింగ్ కొరకు నా ఆర్థిక సమస్యల వలన అది పూర్తి చేయలేకపోయా నని, నా ఆర్ధిక ఇబ్బందుల దృష్ట్యా బ్లాస్టింగ్ ఖర్చులు, రాడ్ మెటీరియల్, సిమెంట్, క్రేన్ ఖర్చులు, ప్రభు త్వం ద్వారా ఇప్పించగలరని కోరారు.డోర్నకల్ మండ లం ములకలపల్లి గ్రామానికి చెందిన రావూరి అ నంతరావు ములకలపల్లి గ్రామ రెవెన్యు పరిధిలోని 82/ఏ, /2/1 సర్వే నెంబర్లో గల ఎకరం భూమిని కొనుగోలు చేసి అందులోని 20గుంటల భూమిని తన కూతురి పేర గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేసి పట్టా అయ్యా క ఇతర వ్యక్తులు అక్రమంగా తన కూతురి పేరుపై ఉన్న భూమిని అక్రమంగా అక్రమించుకున్నారని ఎం క్వైరీ చేసి తన కూతురు పేరుపై ఉన్న భూమికి పాస్ బుక్ ఇప్పించి తగు న్యాయం చేయాలని కోరారు.గార్ల మండలం తహసీల్దార్ బజార్‌కు చెందిన నాగటి మల్లమ్మ తను నిరుపేదని 20 సంవత్సరాలుగా ఇద్ద రు పిల్లలతో ఒంటరిగా కూలిపని చేసుకుంటూ పిల్ల ల్ని పోషించుకుంటున్నానని, కిరాయి ఇంట్లో ఉంటు న్నానని ఇప్పుడు కిరాయి కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్నానని నాకు తహసిల్దార్ బజార్ ఉన్న 125 గజా ల స్థలంలో ఇల్లు కట్టుకొనుటకు ప్రభుత్వం ద్వారా ఇల్లు మంజూరు చేయాలని కోరారు. మహబూబా బాద్ మండలంలోని బేథోల్ మాన్సింగ్ తండాకు చెం దిన భూక్య చందా కురవి మండలంలోని సర్వే నెంబ ర్ 277లో తనకున్న 2 ఎకరాల 20 గుంటల భూ మి అక్రమంగా తన పక్కన రైతు తన భూమిలోకి వస్తున్నాడని అందుకు సర్వే చేయించి హద్దులు పెట్ట మని స్థానిక తహశీల్దార్ కార్యాలయానికి మీ సేవా ద్వారా దరఖాస్తు చేసుకుని చాలా రోజులైనప్పటికి ఇంతవరకు హద్దు రాళ్లను ఏర్పాటు చేయలేదని కావు న ఇరువురి భూములకు వాటా ప్రకారంగా హద్దు రాళ్ళను నిర్ణయించి న్యాయం చేయాలనికోరారు. మా జీ కేంద్రమంత్రి పోరిక బలరాం నాయక్ నెల్లికుదురు మండలం మీటియాతండా గ్రామం పంతులు తండా నివాసం రైతుల భూ సమస్యలపై జిల్లా కలెక్టర్‌ని కలి సి సమస్యలను వివరించారు.ఈ రోజు నిర్వహించిన ప్రజావాణిలో వచ్చిన (98) దరఖాస్తులపరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.