Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏకపక్షంగా పనులు కేటాయిస్తున్నాడని ఆవేదన
- కౌన్సిలర్ల హక్కులు కాపాడుకుంటాం
- త్వరలో భవిష్యత్తు కార్యాచరణ
నవతెలంగాణ-మహబూబాబాద్
అభివృద్ధి పనుల కేటాయింపు నిధుల నిర్ణయాలపై మహబూబాబాద్ మున్సి పల్ కౌన్సిలర్లను ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ విస్మరించడం పై అధికార, ప్రతి పక్ష (బీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం) కౌన్సిలర్లు సమావేశమై నిరసన తెలిపారు. ఎమ్మె ల్యే శంకర్ నాయక్ కౌన్సిలర్లను పట్టించుకోకుండా ఏక పక్ష నిర్ణయాలు తీసుకుం టున్నారని కౌన్సిలర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఒక వైపు వార్డులకు 1 కోటీ రూపా యలు కేటాయించాలని కౌన్సిలర్లు అడుగుతుంటే ఎమ్మెల్యే శంకర్ నాయక్ వార్డు లలో సంభందం లేని వ్యక్తులతో కలియ తిరుగుతూ ఏక పక్ష నిర్ణయాలుతీసుకుం టున్నారన్నారు. 14,15వ ఆర్థిక సంఘం నిధులు, పట్టణ ప్రగతి నిధులు వివిధ నిబంధనలతో 3 ఎండ్లుగా కౌన్సిల్లో (అన్ని పార్టీల ) కౌన్సిలర్లు పలు సందర్భాల్లో కలెక్టర్, ఎమ్మెల్యే, ఎంపీ, ఎంఎల్సీ దృష్టికి తీసుక రావడం జరిగిందని, ఆ నిబంధ నల వలన వార్డులకు నిధులు రాలేదు అన్నారు. ఇప్పుడు సీఎం కేసీఆర్ మహబూ బాబాద్ మున్సిపాలిటీకి కేటాయించిన 50 కోట్ల నిధులను కలెక్టర్, మంత్రి, ఎమ్మె ల్యే, ఎంపీ, ఎంఎల్సీ కౌన్సిలర్లు సమన్వయంతో చేయాల్సి ఉండగా కేవలం ఎమ్మెల్యే ఒక్కడే ఈ నిధుల పనుల కేటాయింపు పై మహబూబాబాద్ మున్సిపాలి టీ వార్డులలో పర్యటించడం సమంజసం కాదన్నారు. 3 ఎండ్లుగా నిధులు లేక వార్డులలో అభివృద్ధి జరగక పోవటం వల్ల వార్డుల ప్రజలకు సమాధానం చెప్తూ వచ్చిన కౌన్సిలర్లకు ఇప్పుడు ఏ రకంగా ఎమ్మెల్యే వ్యవహరిస్తున్న తీరు ఎంత వరకు సబబో చెప్పాలన్నారు. కౌన్సిలర్ల హక్కుల కోసం నిధులు కేటాయింపు కోసం భవిష్యత్తు కార్య చరణ చేపడతాం అని తెలిపారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ వెన్నం లక్ష్మరెడ్డి, సీపీఎం ఫ్లోర్ లీడర్ సుర్ణపు సోమయ్య, సిపిఐ మున్సి పల్ ఫ్లోర్ లీడర్ బి.అజరు సారధిరెడ్డి, బీఆర్ఎస్ కౌన్సిలర్ ఎడ్ల వేణు, సిపిఐ కౌన్సిలర్ బి.నీరజ రెడ్డి, కౌన్సిలర్లు భుజ్జి వెంకన్న, బానోత్ హరిసింగ్, అరెంపు ల విజయమ్మ, పోతు రాజు, కోడి నాగ లక్ష్మి, భుఖ్య శ్రీను, బుక్య సునీత, రవి కుమార్, తాళ్ళ పల్లి జగన్, నిమ్మల శ్రీను పాల్గొన్నారు.