Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నర్మెట్ట
రైతుల పట్ల ఛైర్మెన్, బ్యాంకర్లు అనుసరిస్తున్న వ్యతిరేక వైఖరి చాలా బాధాకరం అని సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు కమలాకర్ రెడ్డి అన్నారు. సోమవారం నర్మెట్ట మండల కేంద్రములోని పిఏసీస్ కోనుగోలు కేంద్రం ప్రారంభంనికి గైహాజరు కావడం పై మండల బీఅర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కమలాకర్ రెడ్డి మాట్లాడుతూ నర్మేట్ట మండల పీఏసీఎస్ ఛైర్మెన్‌గా కేసిరెడ్డి ఉపేందర్‌రెడ్డి ఎన్నికై దాదాపు 3 సంవత్సరా ల 6 నెలలు కావొస్తున్న, రైతుల పట్ల ఛైర్మెన్, బ్యాంక ర్లు అనుసరిస్తున్న వ్యతిరేక వైఖరి చాలా బాధాకరమ ని, స్థానిక ప్రజాప్రతినిధులకు ఏ విషయంలోనూ సరె ౖన సమాచారం ఇవ్వకపోవడం, చాలా సందర్భాల్లో వడ్ల కొనుగోళ్ళ విషయంలో రైతులు ఎన్ని అవస్థలు పడ్డా కూడా కనీసం సెంటర్ల వద్దకు రాకపోవడం, అదే విదంగా గతంలో ట్రాన్స్ పోర్ట్ విషయం రైతులు 2 నుండి 3 నెలలు వడ్లు తరలించడానికి సమయం పట్టి రైతులు నష్టపోయారని అన్నారు. ఈ విషయా న్ని పదే పదే గుర్తుచేసిన కూడా పట్టించుకోకపోవ డం రైతులందరు అసహానానికి గురయ్యారు. ఆ సం దర్బంలో స్థానిక సర్పంచ్‌గా వడ్లను తురుపాల బట్టే యంత్రాన్ని తెప్పించడం జరిగింది. మరియు ట్రాన్స్ పోర్ట్ విషయంలో కూడా స్థానిక గ్రామంలోని ట్రా క్టర్లను మాట్లాడి వడ్లను తరలించడం జరిగింది. కరో నా సమయంలో కనీసం సెంటర్లను కూడా ప్రారం భించడానికి రాని ఛైర్మెన్, రైతులు ఫోన్లు చేస్తే కనీసం లిఫ్ట్ చేయకపోవడం లాంటివి కూడా చాలా సార్లు జరిగాయి.ధరణి పాస్ బుక్ వున్న రైతులు బ్యాంకుకు వెళ్లి సంబంధిత పేపర్లు చూపించిన కూడా బ్యాంకు మేనేజర్,ఫీల్డ్ ఆఫీసర్ రైతులకు ఇంకా పేపర్లు కావా లని తరచూ తహసీల్దార్ ఆఫీస్ చుట్టూ తిప్పడం, తీరా ఆఫీస్‌కు వెళ్తే వున్న పేపర్లు సరిపోతాయాని అధికారులు చెప్పడం రైతులకు ఓపికను నశింపజేస్తు న్నాయి. ఈ విషయాన్నీ చాలా సార్లు ఛైర్మెన్ ఉపేం దర్ దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోవడం లేదని, బ్యాం కర్లు ఛైర్మెన్ వద్దకే వెళ్ళమనడడం రైతులకు పెద్ద తల నొప్పిగా మారింది.మండలంలోని రైతులు పడుతున్న ఇబ్బందుల విషయంలో ప్రతి సంవత్సరం మహాజన సభ ఏర్పాటు చేసి వాటి గురించి తెలుసుకోవడం జరుగుతుంది, కానీ ఇప్పటివరకు ఒక్క మహాజన సభను ఛైర్మెన్ నిర్వహించక పోగా కేవలం రిజిస్టర్లల్లో సంతకాలు మాత్రమే చేయిస్తున్నారు.ఏదైన కార్యక్ర మం వున్న టైంకు రాకపోవడం, ప్రజాప్రతినిధులను గంటల తబడి చూసి నర్మెట్ట బీఅర్ఎస్ నాయకులు నర్మెట్ట, తరిగోప్పుల మండల కన్వీనర్ పెద్ది రాజిరెడ్డి, ఎంపీపీ గోవర్ధన్, బీఅర్ఎస్ మండల అధ్యక్షుడు సురేష్ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారభించారు.