Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వరంగల్
పేదల సంక్షేమాన్ని ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయని సీపీఐ (ఎంఎల్) ప్రజా పంథా ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించిన అనం తరం కలెక్టర్‌కి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా సీపీఐ ఎంఎల్ ప్రజా పంథా జిల్లా నాయకులు చిర్ర సూరి మాట్లాడుతూ అర్హులైన పేదలందరికీ డబల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని, సొంత జాగా ఉన్నవారికి ఇంటి నిర్మాణ మునకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రూ.10 లక్షల ఇవ్వాలని, సొంత ఇంటి స్థలం లేని వారికి ప్రభుత్వ భూమిని కేటాయించాలని, తెల్లరేషన్ కార్డు లబ్ధి దారులకు 12 రకాల నిత్యవసర సరుకులు, 10 కేజీల సన్న బియ్యం రేషన్ షాపుల ద్వారా ఉచితంగా అందించాలని, కొత్తపెన్షన్స్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు పేదప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ పథ కాలు అందే విధంగా చొరవ చూపాలని కోరారు. లేకపోతే పెద్దఎత్తున ఉద్యమిస్తా మని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ (ఎంఎల్) ప్రజాపంథా వరంగల్ జిల్లా నాయకులు పసునూరిరాజు,పిడిఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షులు నరసింహారావు, సీపీఐ (ఎంఎల్) ప్రజాపంథా వరంగల్, నర్సంపేట డివిజన్ నాయ కులు అడ్డూరి రాజు, మైదం పాణి, సాబిరికాని మోహన్, కత్తుల కొమురన్న,దార లింగన్న, అల్లం నారాయణ, జవహర్ లాల్, మనోహర చారి, రాజేందర్, ఎల్లయ్య, చిన్న స్వామి, వెంకటేష్, మల్లేష్, రాజు తదితరులు పాల్గొన్నారు.