Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వరంగల్
బల్దియా ప్రధాన కార్యాలయం సమావేశం మందిరంలో సోమవారం ప్రజా వాణి కార్యక్రమంలో బల్దియాకు చెందిన వివిధ విభాగాల ఉన్నతాధికారులు పాల్గొ ని ప్రజల నుండి వినతులు స్వీకరించారు. ప్రజావాణిలో మొత్తం వివిధ విభాగాల కు చెందిన 50 ఫిర్యాదులు అందాయి. విభాగాల వారీగా టౌన్ ప్లానింగ్ విభాగం 21, పన్నుల విభాగం 8, ఇంజనీరింగ్ విభాగం13, పబ్లిక్ హెల్త్, శానిటేషన్ విభా గం 5, వాటర్ సప్లరు విభాగం 2, ఉద్యాన వనవిభాగం 1 ఫిర్యాదులు వచ్చాయ ని అధికారులు తెలిపారు. వరంగల్ మహానగర సంస్థ పరిధిలోని 2వ డివిజన్ హన్మకొండ జిల్లా హసన్పర్తి మండలం వంగపహాడ్ గ్రామ రెవిన్యూ పరిధిలో గల (526 సర్వేనంబర్) చింతల్ చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో వెలుస్తున్న అక్రమ కట్టడా లు,చెరువు మధ్యలో 8 ఎకరాల చుట్టూర ప్రహరీగోడలు నిర్మించినా పట్టించుకునే ప్రభుత్వ అధికారే కరువైన దీన పరిస్థితి నెలకొన్నదని పేర్కొంటూ పౌర స్పందన వేదిక ప్రతినిధులైన అధ్యక్షులు కరేటి శంకర్ రావు, నల్లెల్ల రాజయ్యలు డిప్యూటీ కమిషనర్ రవీందర్ యాదవ్కు వినతి పత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో అద నపు కమీషనర్ రవీందర్ యాదవ్, డిప్యూటీ కమిషనర్లు అనిసుర్ రషీద్, జోనా, శ్రీనివాస్ రెడ్డి, ఎస్ఈలు కృష్ణ రావు,ప్రవీణ్ చంద్ర, సిఎంహెచ్ఓ డాక్టర్ రాజేష్, సిటీప్లానర్ వెంకన్న, బయలజీస్ట్ మాధవరెడ్డి, డిఎఫ్ఓ శంకర్లింగం పాల్గొన్నారు.