Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -తాడ్వాయి
మహబూబాబాద్ జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ మంకిడి ఎర్రయ్య కొడుకు మంకిడి ప్రదీప్ (24) ఆదివారం అనారోగ్యంతో కన్నుమూశారు. దీంతో మంకిడి ఎర్రయ్య కుటుంబం, బంధువులు స్నేహితులు, ఆదివాసి గ్రామాల ప్రజలు, లోక సముద్రంలో మునిగిపోయింది. ప్రదీప్ అనారోగ్యంతో ఆదివారం సాయంత్రం ఓ ప్రైవేట్ హాస్పటల్ తీసుకెళ్లగా మతి చెందాడు. మంకిడి ఎర్రయ్య ములుగు జిల్లా ఏటూరునాగారం ఐటీడీఏలో గతంలో డిటిడిఓగా, డిప్యూటీ డైరెక్టర్గా విధులు నిర్వహించారు. ప్రస్తుతం మహబూబాద్ జిల్లాలో ట్రైబల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు. సోమవారం వారి స్వగ్రామం నర్సాపూర్ (పిఏ)లో అంత్యక్రియలు నిర్వహిం చారు. ఆదివాసి గ్రామాల ప్రజలు, ప్రజా ప్రతినిధులు, ఉద్యోగ సంఘాల నాయకులు, ఉన్నతాధికారులు తండూప తండలుగా కదిలారు. శోభాయమానంగా ప్రదీప్ అంతిమయాత్ర ముగిసింది. ప్రదీప్ మతదేహాన్ని ములుగు జిల్లా కలెక్టర్ కష్ణ ఆదిత్య, మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ శశాంక్, ఏటూర్ నాగారం ఐటిడిఏ పిఓ అంకిత్, ములుగు జిల్లా వైద్యాధికారి, మండల ప్రత్యేక అధికారి అల్లెం అప్పయ్య, స్థానిక తహసిల్దార్ ముల్కనూర్ శ్రీనివాస్, ములుగు జడ్పీ వైస్ చైర్మన్ బడే నాగజ్యోతి, డిప్యూటీ డిఎం అండ్ హెచ్ వో లు కోరం క్రాంతి, మంకిడి వెంకటేశ్వర్లు, డీటిడివోలు దెబ్బకట్ల జనార్ధన్, ప్రేమకళ, ఎన్పీడీసీఎల్ ములుగు జిల్లా డీఈ పులుసం నాగేశ్వరరావు, టి డబ్ల్యూ టి యు రాష్ట్ర అధ్యక్షులు పొదెం కష్ణ ప్రసాద్, ఆదివాసి ఉద్యోగుల సంఘం ములుగు జిల్లా అధ్యక్షులు మంకిడి రవి, ఏటిడిఓ దేశ్రాం, మేడారం పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, ఆదివాసి ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంకిడి బుచ్చయ్య, యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు గొప్ప సమ్మారావు, జిసిసి డైరెక్టర్ పులుసం పురుషోత్తం, తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షులు వట్టం ఉపేందర్, వ్యవసాయ శాఖ అధికారి కోరిక జై సింగ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బొల్లు దేవేందర్, ఐటిడి ఏఓ దామోదర స్వామి, శ్రీనివాస్, వివిధ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు, మహిళా సంఘాల నాయకులు, ఆదివాసి గిరిజన సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.